రాష్ట్రీయం

భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలక్కం కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంపై స్వామిని ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత్స్యావతార అలంకరణలో ఉన్న స్వామిని గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలమూర్తుల వద్ద పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామిని ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజన సందోహం మధ్య గోదావరి ఒడ్డు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తర్వాత కల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామిని భక్తుల దర్శనార్థం ఉంచారు. అక్కడి నుంచి భద్రాద్రి పురవీధుల్లో స్వామికి తిరువీధి సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్ పత్తు ఉత్సవాల్లో స్వామి బుధవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణాలు నిలిపివేశారు.

చిత్రం..రామయ్యకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు