రాష్ట్రీయం

చంద్రబాబును పిలవలేదెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలకు తోటి తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు పిలిచారా? లేదా? పిలవకపోతే ఎందుకు పిలవలేదు? పిలిస్తే బాబెందుకు రాలేదు? అన్న ప్రశ్నలు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రజల్లో పజిల్‌లా మారాయ. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ సీఎం కేసీఆర్ తరఫున ఒకరు చంద్రబాబుకు అత్యంత అనుంగు అనుచరుడితో మాట్లాడారు. మహాసభలు ప్రారంభానికి చాలా ముందే ఫోన్‌లో సంభాషణ జరిగింది. అయితే సభలు జరిగే సమయంలోనే చంద్రబాబు మాల్దీవులకు వెళ్లేందుకు పర్యటన ఖరారైందని, పర్యటనకు ముందు మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటం వల్ల హైదరాబాద్ రావడం కుదరదని చెప్పారని తెలిసింది. ఈ సందర్భంలో చంద్రబాబును కేసీఆర్ అధికారికంగా ఆహ్వానించినా ఆయన రాకపోతే బాగుండదని ఆహ్వానించలేదని అంటున్నారు. కేసీఆర్ ఆహ్వానిస్తే సభలకు చంద్రబాబు వెళ్లడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల వెళ్లడం బాగుండదని బాబు భావించారట. అంటే ఇరువైపులా నాయకులు తమపై ఎలాంటి అపవాదు, నింద రాకుండా బయటపడేందుకు ప్రయత్నించారని అర్థమవుతుంది.