రాష్ట్రీయం

తెగని పంచాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ వేసిన విభజన గొంగళి అక్కడే మూడేళ్లు గడచినా ఎటూతేలని వ్యవహారం
9, 10 షెడ్యూల్స్ నిధులు బ్యాంకుల్లోనే.. నీటి వినియోగంపై కరవైన సమన్వయం

హైదరాబాద్, డిసెంబర్ 20: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లు గడచినా కొన్ని సంస్థల విభజన పూర్తికాలేదు. రాష్ట్ర విభజన 2014 జూన్ 2న జరిగితే, కొన్ని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికీ స్పష్టత లేదు. దీనివల్ల ఆయా సంస్థలకు చెందిన నిధులు బ్యాంకుల్లో మూలుగుతుంటే, సంస్థలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 9, 10 షెడ్యూల్స్‌కు సంబంధించిన ప్రభుత్వరంగ సంస్ధలు, వర్శిటీలను చేర్చారు. ఈ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు ఉన్నాయి. 10వ షెడ్యూల్‌లో 142 సంస్ధలున్నాయి. ఈ సంస్థల విభజన కోసం షీలా బేడీ కమిటీని కేంద్రం నియమించింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కమిటీ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కొన్ని సంస్థల విషయమై రెండు రాష్ట్రాలు కోర్టును కూడా ఆశ్రయించాయ. 9వ షెడ్యూల్‌లో పది సంస్థలకు సంబంధించి రూ.6481 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏపీ జెన్కోకు సంబంధించి రూ.2448 కోట్లు, ఆంధ్రపదేశ్ మార్కెటింగ్ ఫెడరేషనన్‌కు సంబంధించి రూ.209 కోట్ల నిధులు ఉన్నాయి. 10వ షెడ్యూల్‌లో పది సంస్థలకు సంబంధించి రూ.2994 కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో ఇంతవరకు ఇరు రాష్ట్రాల మధ్య రూ.1559 కోట్ల నిధుల పంపకం జరిగింది. మరో రూ.1435 కోట్ల నిధుల పంపిణీ జరగాల్సి ఉంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి రూ.425 కోట్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు రూ.109 కోట్ల నిధులున్నాయి. రెండు రాష్ట్రాలు నిధులు, రుణాలు, ఉద్యోగాల పంపకాలపై వీలైనంత త్వరగా చర్చలు జరిపితే తప్ప ఒక కొలిక్కిరావని ఉద్యోగ సంఘాలంటున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుంటే తప్ప వీటికి ఇప్పట్లో పరిష్కారం లభిస్తుందనే గ్యారంటీ లేదని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత విశే్వశ్వరరెడ్డి అన్నారు.
కాగా ఆర్టీసి విభజనపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. సాంకేతికంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తమ పేరుమీద ఆర్టీసి సంస్థను ఏర్పాటు చేసుకున్నా, ఇంకా విభజనకు చట్టబద్ధత లేదు. హైదరాబాద్‌లోని ఆర్టీసి ఉమ్మడి ఆస్తులపై తమకు వాటా వస్తుందని ఏపీఎస్‌ఆర్టీసీ పట్టుబడుతోంది. నాలుగు నెలల క్రితం తెలంగాణకు చెందిన ఆర్టీసి ఉన్నతాధికారులు, రవాణా మంత్రి కూడా ఆర్టీసీ విభజనపై విజయవాడకు వెళ్లి వచ్చారు. కానీ చర్చల్లో పురోగతి కనపడలేదు. గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య కూడా 9, 10 షెడ్యూళ్ల పరిధిలోని సంస్థలపై చర్చలు జరిగాయి. ఆశించిన ఫలితాలు లభించలేదు. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పూర్తి స్థాయి చర్చ జరిగితే తప్ప శాశ్వతఫార్ములా వచ్చేటట్లు లేదు. మరో మూడు నెలల తర్వాత వేసవి ప్రభావం పడితే, మంచినీటికి కటకట తలెత్తుతుంది. నీటి వినియోగంపై ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య స్పష్టత రాలేదు. కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై బోర్డు మీటింగ్‌ల్లో పేచీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా రిలీవ్ చేసిన 1259 మంది ఉద్యోగుల సమస్య హైకోర్టుకు చేరింది. దీనిపై రెండు ప్రభుత్వాలు భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో హైకోర్టు ధర్మాసనం త్వరలో ఈ వివాదం పరిష్కారానికి రోజూవారీ విచారణ చేపడుతామని ప్రకటించిన విషయం విదితమే.