ఆంధ్రప్రదేశ్‌

జీవో 30ను అధ్యయనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: రిజర్వేషన్లు పొందిన కులాలు గతంలో ఏ పద్ధతిలో పొందాయో రాష్ట్రంలోని కాపు మేధావులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ కోరారు. ఇదే సందర్భంలో జీవోనెం.30పై కూడా అధ్యయనం చేసి వాస్తవాలను కాపులకు తెలియజేయాలని కోరారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అవాస్తవాలతో, అబద్ధాలతో, అవగాహన లేమితో రాష్ట్రంలోని కాపు సోదరులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా కాపులకు రిజర్వేషన్ తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అవాస్తవాలతో కాపు సోదరులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే జీవో నెంబర్ 30 లైవ్‌లోనే వుంది. కాని ఈ లోపభూయిష్టమైన జీవోను అమలుచేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. అందుకే కమిషన్ వేశాం. 9 నెలల్లో నివేదిక వస్తుంది.
తప్పక రిజర్వేషన్స్ తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు కల్పిస్తుందని తెలియజేస్తున్నానని మంత్రి నారాయణ అన్నారు. సోమావరం ఆత్మహత్య చేసుకున్న కాపు సోదరుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి నారాయణ, దయచేసి ఎవ్వరూ ఎలాంటి ఆవేశాకావేశాలకు గురికావద్దని మంత్రి నారాయణ కోరారు.
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు
తుని ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి రాసిన బహిరంగ లేఖలో రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ మండిపడ్డారు. చిరంజీవి సిఆర్డీఏ చట్టం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పూర్తిగా చదివి చట్ట ప్రకారం అన్నీ జరుగుతున్నాయో లేదో తెలుసుకుని మాట్లాడితే బావుంటుందని మంత్రి హితవు పలికారు. రాజధాని విషయంలో ప్రతి అంశం పారదర్శకతతోనే జరుగుతోందని, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపిన మంత్రి పార్ట్‌టైం రాజకీయాలు చేసి చిరంజీవికి బహుశా రాజధానిలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక, ఓపిక లేనందువల్లే ఆయనకు పారదర్శకత లేదని అనిపించి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 29 గ్రామాల్లో లక్షా 9వేల మంది జనాభా కలిగిన ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయ్, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నాం. గత వారం రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ, అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తుంటే... చిరంజీవి అవగాహన లేని మాటలతో రైతుల్లో అయోమయం సృష్టించడం సమంజసం కాదని మంత్రి నారాయణ విమర్శించారు. దయచేసి ఏ నాయకుడైనా రాజధాని గురించి మాట్లాడే ముందు ఒకటి రెండుసార్లు అధ్యయనం చేసి మాట్లాడాలని కోరుతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి నారాయణ అన్నారు.