రాష్ట్రీయం

మంత్రులపై ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలని, వృద్ధిరేటు గణనీయంగా పెంచేందుకు కృషి చేయాలని సిఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర మంత్రులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కేబినెట్ ఏర్పడిన తర్వాత జరిగిన సమావేశాల్లో శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశం కీలకమైందని రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. 2016-17 సంవత్సరానికి ఏపీ వృద్ధిరేటు లక్ష్యాన్ని 15శాతంగా నిర్ణయించుకోవడంతో మంత్రులకు సిఎం ఛాలెంజ్ విసిరినట్టయ్యింది. 13 జిల్లాలతో కూడిన ఏపీ ఏర్పాటు తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గంపై పెనుభారం పడిందని ఆయన వివరించారు. చాలా దేశాలు వృద్ధిరేటును ఎనిమిది శాతం చేరుకునేందుకే నానా తంటాలు పడుతున్నాయని, దేశంలో కూడా వృద్ధిరేటు ఎనిమిది శాతం మించడం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు చాలా తక్కువగా ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 6శాతం నుండి 9శాతం వరకు ఉంటోందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. భారత్‌లో 2011లో వృద్ధిరేటు 6.6 శాతం, 2012లో 5.1 శాతం, 2013లో 6.9 శాతం, 2014లో 7.4 శాతంగా నమోదైందని గుర్తు చేశారు.
ఏపీకి సంబంధించి 2014-15లో 7.48 శాతం వృద్ధిరేటు సాధించగా, 2015-16లో 10.87 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం కొనసాగుతుండటంతో ఎంత శాతం వృద్ధి నమోదవుతుందో తర్వాత తేలుతుంది. వాస్తవ పరిస్థితి ఇలావుంటే, 2016-17 సంవత్సరానికి ఏపీ వృద్ధిరేటు లక్ష్యాన్ని 15 శాతంగా నిర్ణయించుకోవడంతో దాదాపు మంత్రులందరిపై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది. ఒక శాఖ గణనీయంగా వృద్ధిరేటు సాధిస్తే, అదే సమయంలో మరోశాఖలో తక్కువ వృద్ధిరేటు నమోదైతే సంబంధిత మంత్రికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగానే అన్ని శాఖల మంత్రులూ తమ తమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో తరచూ సమావేశాలు, సమీక్షలు నిర్వహించి అభివృద్ధిలో ముందంజలో ఉండాలని భావిస్తున్నారు. థియరీగా ఇది బాగానే ఉన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్భ్రావృద్ధి కోసం ఇప్పటికే ఏడు మిషన్లను రూపొందించారు. వ్యవసాయం, సోషల్ ఎంపవర్‌మెంట్, నాలెడ్జ్ స్కిల్ డెవలప్‌మెంట్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, సేవారంగాలుగా ఈ మిషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, దాదాపు అన్ని శాఖలకు దీంతో సంబంధాలున్నాయి. ఒక్కో శాఖ ఒక్కో మిషన్ కిందకు వస్తుంది. అందువల్ల ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల వ్యయం, దాని నుంచి వచ్చే ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని మంత్రులు నిర్ణయించుకున్నారు.