ఆంధ్రప్రదేశ్‌

మరో రెండు రోజులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆందోళనకారులు నిప్పంటించిన నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆందోళనకారులు నిప్పటించటంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో తగులబడ్డ నాలుగు బోగీల్లో, రెండు బోగీల్లోని ఇంటీరియర్ నిర్మాణం పూర్తి ధ్వంసమయింది. మిగిలిన రెండు బోగీల్లోని ఇంటీరియర్ పాక్షికంగా దెబ్బతింది. అయితే బోగీలు మాత్రం ఫిట్‌గానే ఉన్నాయని, లోపల కొత్తగా సీట్లు, ఇతర నిర్మాణం చేపడితే సరిపోతుందని రైల్వే అధికారులు నిర్ణయించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పట్టాలపై నడించేందుకు బోగీలకు, ఇంజన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోవటం వల్ల పూర్తిగా దెబ్బతిన్న బోగీల లోపల పునర్నిర్మాణాలు చేపడితే సరిపోతుందని రైల్వే అధికారులు నిర్ణయించారు. దెబ్బతిన్న బోగీలను సరిచేస్తే తప్ప రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విశాఖ-విజయవాడ మధ్య పట్టాలెక్కే పరిస్థితి లేదు. అందువల్ల రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆగిపోతే ప్రతి రోజూ నష్టపోవాల్సి వస్తుంది. విజయవాడ రైల్వే డివిజన్‌లో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే తూర్పుగోదావరి జిల్లా ప్రయాణికులకు అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశ్యంతో ఆగమేఘాల మీద రత్నాచల్‌ను పట్టాలెక్కించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు నెల రోజులకు సరిపడే తినుబండారాలు, శీతల పానీయాలు, మంచినీళ్ల సీసాలు, ఇతర ఆహార పదార్ధాలతో ఉండే పేంట్రీ కారును ఆందోళనకారులు పూర్తిగా లూటీ చేసినట్టు తెలుస్తోంది. రైలులోని పార్శిల్ వేన్‌ను తెరిచి విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లే రెండు మోటారు సైకిళ్లను కూడా దుండగులు ఎత్తుకుపోయినట్టు రైల్వే అధికారులు గుర్తించారు. కాగా తుని వద్ద రైలు పట్టాలపైకి ఆందోళనకారులు వేల సంఖ్యలో చేరుకుంటున్నారన్న సమాచారం ముందుగానే విజయవాడ రైల్వే డివిజన్ కేంద్రానికి చేరటంతో అధికారులు మెరుపు వేగంతో అప్రమత్తం కావటంతో అతి పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే దువ్వాడ-రాజమహేంద్రవరం రైల్వే సబ్-స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆందోళనకారుల మధ్య నిలిచిపోయిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో, రైలు ఇంజన్‌కు ఉండే ‘పేంటోగ్రాఫ్’ను(ఇంజన్ నుండి విద్యుత్ తీగలను తాకుతూ ఉండే పరికరం) కిందకు దించేశారు. విజయవాడ డివిజన్ అధికారులు కనుక విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోతే విద్యుదాఘాతానికి గురై చాలా మంది మృతి చెంది ఉండేవారని రైల్వే అధికారి ఒకరు చెప్పారు.

రమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 2: కాపులను బిసిలుగా గుర్తించడంలేదనే మనస్తాపంతో తూర్పు గోదావరి కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి పరామర్శించారు. నగరంలోని డైరీఫారం సెంటర్ రాజీవ్‌గృహ కల్ప సముదాయం సమీపంలో నివసిస్తున్న వెంకట రమణమూర్తి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన నుండి రోడ్డు మార్గంలో నేరుగా జగన్ కాకినాడ చేరుకున్నారు. మృతుడి నివాసానికి వెళ్ళి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చారు. ఈ సందర్భంగా విలేఖరులతో జగన్ మాట్లాడుతూ బాధితుడి కుటుంబాన్ని మానవతాదృక్పథంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుడి కుమార్తె చదువులో మంచి ర్యాంక్ సాధిస్తోందని, తండ్రి మృతితో ఆమె విద్యకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నదని, ప్రభుత్వమే ఆమెను చదివించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిక్క ఎక్కువయ్యిందని విమర్శించారు. న్యాయం కోసం ప్రశ్నించిన వారిపై లేనిమోని అభాండాలు మోపుతున్నారని విమర్శించారు. తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో అమలుజరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసన సభ ప్రతిపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, కొల్లి నిర్మలకుమారి, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు.
సిఎం వైఫల్యాలను జగన్‌కు
ఆపాదించటం తగదు: మేకపాటి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఆపాదించటం తగదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని 41, 42 డివిజన్‌లలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ మేకపాటి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఆ వైపల్యాలను ప్రతిపక్ష నేతపై నిందలు వేయటం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి కాపుల ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరా అవి సాధ్యం కాకపోవటంతో వారిపై అసహనం వ్యక్తం చేయటం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవటంతో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయన్నారు. హామీలు నెరవేరకపోవటంతో వారిలో అసహనం పెరిగిందన్నారు. వాగ్దానాలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉండాల్సిందన్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల
తయారీకి నూతన యంత్రాలు
తిరుమల, ఫిబ్రవరి 2: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే చక్కెరను పాకం పట్టేందుకు టిటిడి అధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాన్ని కోనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు 13.85 లక్షలను వెచ్చించింది. దీంతో పాటు పాకాన్ని నిల్వ చేసే మరో యంత్రాన్ని బెంగళూరు చెందిన సంస్థతో