రాష్ట్రీయం

తిరుమలలో మళ్లీ నకిలీ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 25: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగరాదని, వారు మోసపోకూడదని టీటీడీ యాజమాన్యం ఓవైపు నిరంతరం కృషి చేస్తుంటే, మరో వైపుసిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించి ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లను విక్రయిస్తున్నారు.
సోమవారం 25 ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లతో దర్శనానికి వెడుతున్న భక్తులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి సేకరించన సమాచారం మేరకు కనకరాజు, సుదర్శన్ అనే ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు ఎప్పటి నుంచి ఇలా మోసాలకు పాల్పడి ఎంత మేరకు దండుకున్నారో తెలుసుకోవడానికి విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. అంతేకాకుండా వీరితోపాటు మోసాలకు పాల్పడే వారు ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారంటే వీరి వెనుక టీటీడీ ఉద్యోగులెవరైనా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.