రాష్ట్రీయం

శాతవాహన వర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 25: జిల్లాకేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం సోమవారం విద్యార్థుల ఘర్షణకు వేదికగా మారింది. మనుస్మృతి దగ్ధం పేర భారతమాత చిత్రపటాన్ని కాల్చుతున్న కొంతమంది విద్యార్థులను మరోవర్గం అడ్డుకునే యత్నం చేయగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని, రాళ్ళదాడి వరకు వెళ్ళడంతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే యత్నం చేశారు. అయినా, ఓవర్గం విద్యార్థులు భారతమాత చిత్రపటాన్ని మరోసారి దగ్ధం చేసేయత్నం చేస్తూ, మరోవర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేయడం వివాదానికి హేతువుగా మారింది. చిత్రపటం దగ్ధం చేయటాన్ని అడ్డుకునేందుకు పలువురు ఏబీవీపీ విద్యార్థులు వెళ్ళగా, వారిని చితకబాదినట్టు బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యూనివర్సిటీకి చేరుకుని, ఆందోళనకు దిగారు. వీరిని సముదాయించేందుకు వెళ్ళిన సీపీ కమలాసన్‌రెడ్డితో వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు. భారతమాత చిత్రపటం దగ్ధం చేయటం దేశద్రోహమని, వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ నేతలు సీపీని డిమాండ్ చేశారు. ఏబీవీపీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డవారిని పట్టుకోనిదే కదిలేది లేదంటూ భీష్మిస్తూ, వర్సిటీ ప్రధానద్వారం ఎదుట బైఠాయించారు. దీంతో మరింత ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే అవకాశముందని గ్రహించిన సీపీ పలువురు విద్యార్థులతో పాటు బీజేపీ నాయకులను అరెస్టు చేసి డీపీటీసీకి తరలించారు. ఓవర్గం విద్యార్థులు విసిరిన రాళ్ళతో సాధారణ పౌరులు కూడా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించకుండా, అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, వర్సిటీలో ఓ అధ్యాపకురాలు అసాంఘిక శక్తులను పెంచిపోషించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సి ఉండగా, కుల,మతాల పేర విద్యార్థులను విభజిస్తోందని మండిపడ్డారు. సీపీ వీబీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, గొడవలతో విద్యార్థులు తమ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. మనుధర్మ శాస్త్రాన్ని లెఫ్ట్‌వింగ్, దళిత విద్యార్థులు తగలబెట్టారనే సమాచారంతో ఏబీవీపీ కార్యకర్తలు గొడవకు దిగారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. గొడవలు పునరావృతం కాకుండా వర్సిటీ ఎదుట పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చిత్రం..సీపీ కమలాసన్‌రెడ్డితో బీజేపీ నేతల వాగ్వాదం