రాష్ట్రీయం

పరిహార సేవా సమితిని బెదిరించిన వ్యక్తుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: తిరుమలకు చెందిన స్వచ్చందసేవా సంస్థ పరిహారసేవా సమితి సభ్యుడు భరద్వాజ చక్రవర్తిని బెదిరించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ హైకోర్టుకు తెలిపారు. తిరుమలలో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరిహార సేవా సమితి పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. పరిహార సేవా సమితి సభ్యులను బెదిరించిన వ్యక్తులను అరెస్టు చేసి కేసునమోదు చేసినట్లు హైకోర్టు ధర్మాసనంకు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు. ఈకేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చంద్రవౌళి వాదనలు వినిపిస్తూ తిరుమలలో స్టాల్స్ కేటాయింపులో టిటిడి అవకతవకలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. టిటిడి తరఫున న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుల స్వీకరణకు నిర్దేశించిన యాప్ వచ్చే జనవరి 31వ తేదీకి పూర్తవుతుందని, దీని వల్ల యాత్రికుల సమస్యలను పరిష్కరించగలుగుతామని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ఈకేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేశారు.