రాష్ట్రీయం

భూపరిహారంపై మీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: భూసేకరణ కేసుల్లో యాజమానులకు నష్టపరిహారం చెల్లింపులో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భూసేకరణకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగితే స్టే ఇవ్వాల్సి ఉంటుందని, ఈ అంశంపై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు జడ్జి జి వెంక ట కృష్ణయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఈ అంశాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టుల పరిధిలో భూమి యజమానులు దాఖలు చేసిన అనేక ఎగ్జిక్యూటివ్ పిటిషన్లను జిల్లా జడ్జి జి వెంకటకృష్ణయ్య హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణ కోర్టులు ఇచ్చిన అవార్డులను జిల్లా కలెక్టర్లు అమలు చేయ డం లేదన్నారు. అనంతరం హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు తమ రాష్ట్రాల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయ, ఏమేరకు నష్టపరిహారం చెల్లించారు, చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన అవార్డు పట్ల అసంతృప్తి ఉంటే కోర్టులను ఆశ్రయించే హక్కు భూమి యజమానులకు ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. విచారణ కోర్టులు ఇచ్చిన అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేయడం లేదని హైకోర్టు పేర్కొంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కోర్టుల్లో కేసుల భారం పెరుగుతోందన్నారు. దేవాలయ భూముల సేకరణకు సంబంధించి దేవాదాయ కమిషనర్ వద్ద నష్టపరిహారం సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. భూసేకరణ కేసుల్లోనూ తాము ఇటువంటి ఆదేశాలను జారీ చేయాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది పల్లె నాగేశ్వరరావు కేసుల పరిష్కారినికి గడువు కావాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని పాత భూసేకరణ చట్టం కింద ఇచ్చిన అవార్డులనే ఇంకా అమలు చేయలేదని, ఇక కొత్త భూసేకరణ చట్టం కింద ఇచ్చే తీర్పుల సంగతి ఏమిటని ప్రశ్నించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నాలుగు వారాల్లో భూసేకరణ నష్టపరిహారానికి సంబంధించి కేసులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.