రాష్ట్రీయం

తెరుచుకున్న సాంకేతిక బిడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి పరిధిలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లను తెరిచే ప్రక్రియ ప్రారంభించింది. సర్వే నెంబర్లు 205, 206, 207, 208, 214లోని దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక బిడ్లను బుధవారం సిఆర్‌డిఎ అధికారులు తెరిచారు. నిర్మాణానికి సంబంధించి రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండు బిడ్లను రెండు కంపెనీలు దాఖలు చేశాయి. ఒకటి ఎల్ అండ్ టి కంపెనీ కాగా, మరొకటి షాపూర్జీ పల్లోంజీ సంస్థలు బిడ్లను వేశాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నియమ నిబంధనలను విధించింది. సాంకతిక పరమైన బిడ్లను అధికారులు బుధవారం తెరిచారు. కీలకమైన ఫైనాన్షియల్ బిడ్లను ఈనెల 10న తెరవనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 180 కోట్ల వ్యయంకంటే తక్కువ మొత్తాన్ని ఎవరు నిర్మాణానికి ముందుకొస్తే వారికి ఎల్-1 టెండర్ కింద కాంట్రాక్టు ఇవ్వనున్నారు. మూడు బ్లాకులుగా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించనున్నారు. నాలుగు నెలల్లో పూర్తి చేస్తే 2 శాతం, ఆరు నెలల్లో పూర్తి చేస్తే ఒక శాతం సొమ్మును ప్రోత్సాహకంగా అందించనుంది. సకాలంలో పూర్తి చేయని పక్షంలో మొత్తం వ్యయంలో 10 శాతం తగ్గించనుంది. కాగా తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. వెలగపూడి భూముల్లోనే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించేలా ఉత్తర్వులిచ్చింది. గతంలో మంగళగిరి టౌన్‌షిప్‌లో భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత డిసెంబర్ 29న ఇచ్చిన జీవో 278లో 20 ఎకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మాణాలకు 180 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ భవన నిర్మాణాలు సంప్రదాయ పద్ధతిలో లేదా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సౌకర్యం కల్పించింది.