రాష్ట్రీయం

ఇదీ.. మా సామర్థ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 26: ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెర. దానిపై అనేక పల్లెలనుంచి సర్వీలెన్స్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం. మరోవైపు పరిష్కార వేదిక ద్వారా వందల సిబ్బంది ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్ష ప్రదర్శన. ఇంకోవైపు పీపుల్స్ హబ్, ఈ- ప్రగతి, తాళంవేసి ఉన్న ఇళ్లకు గస్తీ కాస్తున్న పోలీసు కెమెరా కళ్లు. వాతావరణ ప్రత్యక్ష స్థితి. ఒకటా రెండా? రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ముందు సర్కారు సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించనుంది. ఇందుకోసం సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్‌ను కోవింద్ ముందు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయ. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్టప్రతి కోవింద్ ఈ కేంద్రాన్ని బుధవారం సందర్శిస్తున్నారు. తొలుత సుపరిపాలనలో సాంకేతిక పద్ధతులను ప్రదర్శించనున్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని ఒకదాని తరువాత ఒకటిగా తెరపై ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనలు, సలహాల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈవో అహ్మద్‌బాబు, ఆయన బృందం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై రాష్టప్రతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రజలకు అంకితం చేసిన
తరువాత రాష్టప్రతి ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీకి వెళతారు. కాగా సీఎం చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయంలో స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
రాష్టప్రతికి చూపేవి ఇవే...
ఆసియాలోనే అతి పెద్దదైన రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఎలా పనిచేస్తుంది? దాని ప్రత్యేకతను వివరిస్తారు. ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల వీడియో వాల్ (వీడియో స్క్రీన్)పై సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే ప్రత్యేకతలు, అందులో పౌరుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రూపొందించిన కోర్ డేటాను కోవింద్‌కు వివరిస్తారు. మొత్తం 4.3 కోట్ల మంది ప్రజల డేటా పీపుల్స్ హబ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా అందుతున్నాయన్న దానిపై పర్యవేక్షణను వివరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన పరిష్కార వేదిక విజయవంతమైన తీరును వివరిస్తారు. ఈ కాల్‌సెంటర్‌లో ఉద్యోగులు రోజకూ తమకు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తున్నాదీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. కాల్ సెంటర్ మాత్రమే కాకుండా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన ప్రజా సమస్యల కథనాలు, ఇతర మార్గాల్లో వచ్చే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనుసరిస్తున్న విధానాలు.
ఈ- ప్రగతి
ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ- ప్రగతి కార్యక్రమాల ప్రత్యేకతలను వివరిస్తారు. ఆధునీకరించిన 2.0 వెర్షన్ కోర్ డ్యాష్ బోర్డును ఈ సందర్భంగా రాష్టప్రతి ఆవిష్కరించనున్నారు. అలాగే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ప్రభుత్వం వినియోగిస్తున్న తీరుపై ప్రదర్శన ఉంటుంది. రాష్ట్రంలో 20వేల సర్వీలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 3 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల నుంచి వస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను ఒకేసారి 66 అడుగుల వీడియో వాల్‌పై రాష్టప్రతి ముందు ప్రదర్శిస్తారు
ప్రజలతో వీడియో కాన్ఫరెన్సు
పాలికాం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ఒకేసారి వేల మందితో రియల్‌టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి ముఖాముఖి మాట్లాడవచ్చు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ముందు ఈ విధానం చూపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది ప్రజలతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలుకరించనున్నారు. కొన్ని మారుమూల పంచాయతీలను కూడా ఇందుకు సిద్ధం చేస్తున్నారు.