రాష్ట్రీయం

ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: బ్రిటీష్ కాలం నుంచి వైద్యరంగంలో అన్నిం టా క్రియాశీలక పాత్ర వహిస్తూ వచ్చిన మెడికల్ ఆఫ్ కౌన్సిల్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను (ఎన్‌ఎంసీ) తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా కార్పొరేట్‌తో సహా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీని బంద్ చేసి వైద్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే అత్యవసర వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ర్యాలీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కేంద్రంలో వైద్యుల సమ్మె విజయవంతమైంది. వైద్య కళాశాల ఎదుట వైద్యులు, వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై నేడు చర్చ జరగనున్నదనే కారణంతో వైద్యులు ఈ ఆందోళనకు దిగగా.. కేంద్ర ప్రభుత్వం చర్చ లేకుండానే బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించడం తమ తొలి విజయంగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నారు. మళ్లీ ఈ బిల్లు సభలో ప్రవేశపెడితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని దీనికి కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందంటూ ఐఎంఏ విజయవాడ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాసిక్ సంఘవి, ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, తదితరులు హెచ్చరించారు. ఈ బిల్లు వెనుక రాజకీయ కోణం ఉందని డాక్టర్ రమణమూర్తి అన్నారు. మోదీ ప్రభుత్వం 2017లో సరికొత్త వైద్య విధానాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ప్రాథమిక వైద్యం మినహా ఇతర వైద్య సేవలన్నింటికీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ బిల్లు ప్రజా వైద్యానికి తూట్లు పొడిచే హానికరమైనదని, పేదలకు వైద్యం దూరమవుతుందని డాక్టర్ రమణమూర్తితో పాటు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంప్రసాద్, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కెఎస్ కరుణామూర్తి అన్నారు. ముఖ్యంగా కేంద్రం అల్లోపతి వైద్యానికి తూట్లు పొడవబోతున్నదని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నాలుగున్నర సంవత్సరాలపాటు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. యునాని, హోమియో, ఆయుర్వేదం చదివిన వారికి ఇంతకాలం వేరే రిజిస్ట్రేషన్ ఉండేదని, వీరికి స్వల్పకాల పరిమితితో బ్రిడ్జి కోర్సు నిర్వహించి ఎంబిబిఎస్ విద్యార్థులతో సమానంగా సర్ట్ఫికెట్లను అందించాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమన్నారు. ఎంసీఐ కనుసన్నల్లో అడ్మిషన్లు, కోర్సు నిర్వహణ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ జరిగేదని ఈ విధంగా దేశవ్యాప్తంగా 10లక్షల మంది రిజిష్టరయ్యారని అన్నారు. విదేశాల్లో చదివి వచ్చి ఇక్కడ ప్రాక్టీసు చేసుకోవాలంటే ఎంసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవేశపరీక్ష రాయకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చునన్నారు. అలాగే ఇక్కడ ఎంబిబిఎస్ పూర్తిచేసిన వారు మాత్రం ప్రతిభ పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఎంసీఐలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తంపై 75 మంది వైద్యులకు సభ్యత్వం ఉండేదన్నారు. అయితే కొత్తగా ఏర్పాటయ్యే మెడికల్ కమిషన్‌లో కేవలం 25 మంది ఉంటే ఐదుగురు వైద్యులు, 20 మంది వైద్యరంగానికి సంబంధం లేనివారు నియమితులవుతారని అన్నారు. వైద్య కళాశాలల్లో 40 శాతం సీట్లు ప్రభుత్వం ఆధీనంలో ఉంటే 60 శాతం సీట్లను యాజమాన్యాలు అమ్ముకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 40 నుంచి 420కి పెరిగితే దీనివల్ల వందల సంఖ్యలో మరిన్ని ఏర్పడగలవని, వాటిపై పర్యవేక్షణాధికారం ప్రైవేట్ ఏజెన్సీలకు ఉండబోతున్నదని అన్నారు. అందుకే ఈ ప్రమాదకరమైన బిల్లును తిప్పికొట్టాలని రాజకీయాలకతీతంగా దేశవ్యాప్తంగా 650 మంది ఎంపీలను కల్సి ఇప్పటికే కోరామన్నారు. సరికొత్త విధానం వల్ల నాణ్యమైన వైద్య విద్య కరువయ్యే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగం వరకు తమ విధి విధానాలను మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వామి వౌళీకృష్ణ, అనురాగ్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.రవీంద్రనాధ్, డాక్టర్ బోయపాటి మల్లిక, డాక్టర్ పిఎంసి నాయుడు, డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న వైద్యవిద్యార్థులు