రాష్ట్రీయం

గద్వాల గోదాముల్లో విత్తనాల అక్రమ నిల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విత్తన చట్టం అనుమతులు లేని రూ.6.75 కోట్ల విలువైన 4,064 సంచుల సీడ్ విత్తనాలు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారి గోవిందునాయక్, ఏడీఏ అశోక్‌వర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ అగ్రో జనటిక్ లిమిటెడ్‌కు చెందిన పత్తి విత్తనాలు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో నిల్వ ఉన్నాయి. ఈ విషయంపై నకిలీ విత్తనాలు అంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాములో నిల్వ ఉన్న 4,064 సంచులను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ దాదాపు రూ.6.75 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 1983 విత్తన యాక్ట్‌ను ఉల్లంఘించి విత్తనాలను నిల్వ చేశారని వారు తెలిపారు. సరైన సమాచారం, విత్తనాలకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేకపోవడంతో సీజ్ చేసినట్టు వారు తెలిపారు. శ్రీరామ అగ్రోజనటిక్ లిమిటెడ్‌కు సంబంధించిన డైరెక్టర్ ఆంజనేయస్వామి మాట్లాడుతూ అధికారులకు గోదాము నిల్వలపై సమాచారం ఇవ్వకపోవడంతోనే సమస్య ఉత్పన్నమైందని, ఇది రైతుల నుండి సేకరించిన విత్తనాలని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ దృష్టికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏఓ మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.