రాష్ట్రీయం

జిఎస్టీ అమలుతో దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 29: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న వస్తు సేవల పన్ను(జిఎస్టీ) విధానంతో దేశాభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఇక్కడ వుడా పార్కులో ఏర్పాటు చేసిన గ్లోబల్ యూత్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిఎస్టీ వల్ల జాతీయాదాయం 2 నుంచి 2.5 శాతం పెరిగే అవకాశం ఉందని, ప్రపంచంలో 160 దేశాలు జిఎస్టీని అమలు చేస్తున్నాయన్నారు. జిఎస్టీపై పదేళ్లుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, చైనా, జపాన్, ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాల్లో పర్యటించి అందించిన నివేదికల ఆధారంగా దీనికి తుదిరూపు తీసుకొచ్చామన్నారు. లోక్‌సభలో తానే బిల్లును ప్రతిపాదించానని, లోక్‌సభలో ఆమోదం పొందిందని, రాజ్యసభ ఆమోదం కోసం బిల్లును పంపినట్టు చెప్పారు. అక్కడ ఎన్డీయేకు సరైన మెజార్టీ లేని కారణంగా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సి వచ్చిందని వివరించారు. బిల్లును స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందినందున సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేనప్పటికీ సర్వ జన ఆమోదం కోసం బిల్లును పంపించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా సూత్రప్రాయంగా బిల్లును ఆమోదించిందని వెల్లడించారు. బిల్లును అమలు చేయడం వల్ల దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు సంక్షేమ పథకాలను అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుంటుందన్నారు.
ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని పలు దేశాలు వత్తిడి తెస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలత సాగుతున్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో పయనిస్తోందని ఇటీవల ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మోనిటరింగ్ ఫండ్) సంస్థ వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో రాజకీయ సిద్ధాంతాలతో ప్రధాని మోదీని, బిజెపిని ఎదుర్కొలేక తెరవెనుక కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రలను యువత, మేధావులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపుతోందన్న మీడియా ప్రశ్నకు కేంద్ర బృందం అందించిన నివేదికల ఆధారంగానే నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు. హుదూద్ సమయంలో రూ.736 కోట్లకు మాత్రమే సరైన గణాంకాలు చూపారని, ఆమేరకు మొత్తం విడుదల చేశామని వివరించారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కె హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.