రాష్ట్రీయం

నాది పేదల కులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 2: సమాజంలో రెండు వర్గాలు ఉంటాయని అందులో ఒకటి డబ్బు ఉన్న వారి కులం, మరొకటి డబ్బులేని పేదకులమని తాను మాత్రం పేదల కులమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. మంగళవారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రంలోని శివరాజ్‌నగర్ ఆదర్శపాఠశాలలో పండగ వాతావరణాన్ని తలపించే విధంగా జన్మభూమి -మాఊరు కార్యక్రమం రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు ఆధ్వర్యంలో జరిగింది. జన్మభూమి -మాఊరు కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో కుల వ్యవస్ధ వల్ల ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయన్నారు. ఆ అసమానతలను తగ్గించేందుకు తాను కృషిచేస్తానని తెలిపారు. గత జన్మభూమి కార్యక్రమాలు పదిరోజుల పాటు నోడల్ ఆఫీసర్లే వచ్చి స్వయంగా సమస్యలను పరిష్కరించేవారని కాని ప్రస్తుత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల్లోనుండి చైతన్యం తెచ్చేందుకు, అవగాహన పెంచేందుకు, భాగస్వామ్యం చేసేందుకు తొమ్మిదిరోజులపాటు తొమ్మిది అంశాలపై చర్చ జరిగిన పదోరోజున ఆనందలహారి కార్యక్రమాన్ని నిర్వహిస్తాన్నారు. రాష్టవ్రిభజన ప్రజలు కోరుకుంటే రాలేదని, ఆనాటి కాంగ్రెస్ పెద్దల రాష్ట్రప్రజల పొట్టకొట్టి హేతుబద్దత లేకుండా విభజించారని, ఆదాయం హైదరాబాదుకు,ఖర్చులు నవ్యాంధ్రాకు మిగిల్చారన్నారు. ఆ సమయంలో ప్రతిఒక్కరు ఆందోళన చెందారని, బాధపడ్డారన్నారు. తాను రాత్రింబవళ్ళు రాష్ట్రం కోసం కష్టపడటంతో రాష్ట్రం కుదుటపడుతోందన్నారు. రైతుల కష్టాలు చూసి వారిని అన్నివిధాల ఆదుకునేందుకు, రైతులకు అండగా నిలిచేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా 24వేల కోట్లరూపాయలు రుణమాఫీ చేశామన్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్‌గా తీసుకుని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రుణమాఫీ చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో నీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని నీటి భద్రత కింద ఒకపంటను కాపాడుకునేందుకు నీరు అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పిస్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ధరలు లేక
ఆత్మహత్యలకు పాల్పడ్డారని తన హయాంలో రైతులకు మద్దతు ధరలకు ఇవ్వటమేకాకుండా నిల్వ ఉన్న శనగలను కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల వ్యవస్ధను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. తన హయాంలో డ్వాక్రాసంఘాలను పూర్తిబలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వడ్డీలేని రుణాలతోపాటు పదివేల రూపాయల చొప్పున లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. ఆహరభద్రత కింద కోటి 42లక్షల రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో నాలుగుకోట్ల 40లక్షలమంది జనాభా ఉంటే నాలుగుకోట్ల ఐదు లక్షలమందికి ఐదుకేజిల చొప్పున బియ్యాన్ని పంపిణీచేస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం రేషన్‌షాపులకు చక్కెర నిలిపివేసిందని, కాని తాను మాత్రం చక్కెరను ఈనెలనుండి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అన్నివర్గాల్లోని పేదలు పండగల సమయంలో పస్తులు ఉండకుండా రంజాన్‌తోఫా, క్రిస్మస్ గిప్ట్‌లు, సంక్రాంతి కానుకలు పంపిణి చేస్తున్నామన్నారు. ఈసంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా ముస్లింలకు కూడా సంక్రాంతి కానుకలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. దీపం పథకాన్ని కాంగ్రెస్‌పార్టీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. తిరిగి మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతిపేదవాడికి రేషన్‌కార్డులు పంపిణి చేస్తున్నామని, ఈనెలలో లక్షా 50వేలమందికి రేషన్‌కార్డులు పంపిణి చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పిన మాటను నిలబెట్టుకుని రాష్ట్రంలో 46లక్షల 19వేల మందికి ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అతిత్వరలో 50లక్షల మంది పేదలకు పెన్షన్లు పంపిణి చేస్తున్నామన్నారు. ఈవిధానం వలన 15వందల కోట్లరూపాయల అదనంగా ప్రభుత్వానికి భారం పడుతుందన్నారు. చంద్రన్న బీమా పథకానికి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చిందని ఈపథకంలో బీమా మిత్రల సేవలు మరవలేనివన్నారు.ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మైనార్టీలతో పాటు కులాంతర వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉగాదినుండి పెళ్లికానుకలను డ్వాక్రాసంఘాల ద్వారా పెళ్లిమండపంలోనే పంపిణి చేస్తామన్నారు. వచ్చే సంవత్సరంలో లక్ష కుటుంబాలకు పెళ్లిళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈసంవత్సరం మార్చినాటికల్లా రాష్ట్రంలోని 13జిల్లాలో ఒడిఎఫ్‌ను సాధిస్తామన్నారు. పేదల స్వంత ఇంటికలతీర్చేందుకు 19లక్షల ఇళ్ళు మంజూరుచేశామని, అవసరమైతే మరిన్ని గృహాలను పెంచేందుకు కూడా వెనకాడేది లేదన్నారు. వెనుకబడిన కులాలకు పదివేల కోట్లరూపాయలను బడ్జెట్‌లో కేటాయించామన్నారు. డ్వాక్రామహిళలకు 2500కోట్లరూపాయల వడ్డీలేని రుణాలుగా పంపిణిచేశామన్నారు.
చేనేత కార్మికులు ఆదుకునేందుకు ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి తద్వారా చీర, దోవతిలను పంపిణిచేస్తామన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ఏడుకోట్లరూపాయలను బడ్జెట్‌లో పెట్టామని తెలిపారు. త్వరలోనే పట్టణ కేంద్రాల్లో అన్నక్యాంటీన్లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. త్వరలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. 2022కల్లా దేశంలోనే మూడు అగ్రరాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందన్నారు. విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన విధంగా అన్నిహామీలను సాధించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి ప్రజల ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టును గోదావరితో అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. 2018 చివరి నాటికి వెలుగొండ మొదటిదశ పూర్తిచేసి 2019నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2029కల్లా రాష్ట్రాన్ని ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. సంక్రాంతి పండగ అంటే జూదం ఆడటం కాదని పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదను కాపాడుకోవాలన్నారు. మనుషులు మానవత్వంతో ముందుకు వెళ్ళాలని, ద్వేషభావాన్ని విడనాడాలన్నారు. అన్నిపండగలను అందరు జరుపుకోవాలని అప్పుడే ఆనందం సమైఖ్య భావం వస్తుందన్నారు. అందరు సహకరిస్తే రాష్ట్రాన్ని టెక్నాలజి ఆంధ్రప్రదేశ్‌గా ముందుకు తీసుకువెళ్తామన్నారు. త్వరలో అందరికి డిజిటల్ లాకర్లను ఇస్తామని ఈవిధానం ద్వారా ఇళ్ళ దొంగతనాలు జరగవని, ఒక వేళ దొంగతనం జరిగిన వెంటనే పోలీసు రంగప్రవేశం చేసి దొంగల్ని అరెస్టు చేస్తారని ఆయన తెలిపారు. ఈనెల 11న ముగింపు సభ ఉంటుందని ఈసభలో ఉత్తమ రైతులకుపాటు మరికొంతమంది సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 80శాతంమంది ప్రజలు తృప్తిగా ఉండాలని, ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు తనకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సభలో రాష్టమ్రంత్రులు శిద్దా రాఘవరావు, పి నారాయణ, ఎంఎల్‌సిలు కరణం బలరాం, జూపూడి ప్రభాకర్, కలెక్టర్ వినయ్‌చంద్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ప్రకాశం జిల్లాలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మావూరు గ్రామసభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు