రాష్ట్రీయం

అన్యాయం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకిపురం (చిత్తూరు), జనవరి 2: రుణమాఫీ చేస్తామని నమ్మించిన చంద్రబాబు తమను అన్యాయం చేశాడని వాల్మీకిపురంలో మహిళలు మంగళవారం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమైయ్యారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా మహిళలు, డ్వాక్రాసంఘాల మహిళలు ఆయన పాదయాత్రలో కలిశారు. ఈసందర్భంగా వారు జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు మాఫిచేస్తామని మహిళలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకులలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము ఆస్తులు, నగలు అమ్ముకోవాల్సి వస్తున్నదని వారు ఏడ్చుకుంటూ జగన్ ముందు గోడు వెళ్లబొసుకున్నారు. దీనిపై జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూన్నాడని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్దిచెప్పి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకరావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే వేరుశనగ పంటకు గిట్టుబాటుధరను కల్పిస్తాం అని
జగన్మోహన్‌రెడ్డి భరోసాఇచ్చారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆయనను వేరుశనగ రైతులు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ పీలేరులోని నూనేగింజల కర్మాగారాన్ని మూసివేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జగన్ రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే పీలేరులో మూసివేసిన నూనెగింజల కర్మాగారాన్ని తెరిపించి రైతులకు మేలుచేకూరేలా చేస్తానని హామి ఇచ్చారు.
50వరోజుకు పాదయాత్ర
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారంతో 50వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం మదనపల్లె రూరల్ మండలం పూలవాండ్లపల్లె నుండి ప్రారంభమైన యాత్ర కాశిరావుపేట, దిగువకాశిరావుపేట మీదుగా వాల్మీకిపురానికి చేరుకుంది. ఈసందర్భంగా పొలిమేర్లలో జగన్‌మోహన్ రెడ్డికి చింతల రామచంద్రారెడ్డి ఘనస్వాగతం పలికారు.

చిత్రం..చిత్తూరు జిల్లా వాల్మీకిపురం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మహిళలతో కలిసి అడుగువేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్