రాష్ట్రీయం

తరలింపునకు సమ్మతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రలో ప్రత్యేక హైకోర్టు నెలకొల్పేందుకు సమ్మతిస్తూ హైకోర్టుకు ఆ రాష్ట్ర సర్కారు ఒక లేఖ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్ర న్యాయ శాఖ ఒక లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఏజీ డి శ్రీనివాస్ ద్వారా పంపించినట్లు సమాచారం. ఇందులో మూడు వసతి సదుపాయాలను ప్రస్తావించారు. ఒక్కో సదుపాయం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది.
ఈ ప్రదేశాలను సందర్శించి ఖరారు చేసేందుకు కమిటీని నియమించాలని కూడా అభ్యర్థించింది. ఇందులో ఎంపిక చేసిన భవన సముదాయానికి మార్పులు చేర్పులను సూచించాలనీ, ఏప్రిల్‌నాటికి భవనాలను సిద్ధం చేస్తామని పేర్కొంది. ఏప్రిల్ 30 నుంచి జూన్ 1 మధ్య హైకోర్టు రికార్డులను ఎంపిక చేసిన భవనానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం. జూన్ 2 నుంచి హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ భవన సముదాయాలను సందర్శించి ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.