ఆంధ్రప్రదేశ్‌

జూన్ నాటికి పూర్తవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత నిర్మాణ పనులకు జూన్ 2న శంకుస్థాపన జరగనుంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి మాత్రం ఈ నెల 12ఉదయం 4.15 నిమిషాలకు శంకుస్థాపన చేయలని సిఎం చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్టు తెలిసింది. అన్ని కార్యాలయాలను తాత్కాలిక సచివాలయానికి తరలించిన తర్వాత వాటి నుండి అద్దె వసూలుచేయనున్నారు. అద్దె వసూలు నిర్వహణ బాధ్యతను సిఆర్‌డిఎకు ప్రభుత్వం అప్పగించింది. ఎంత తొందరగా తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలనుకున్నా జూన్ నాటికి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన తర్వాత కాంట్రాక్టు ఎవరికీ అనేది స్పష్టమవుతుంది, అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే కాంట్రాక్టు ఎల్ అండ్ టికే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నాటికి తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి కాకపోతే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
సీడ్ క్యాపిటల్ పనుల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి ముందు నాంది పలకనున్నారు. విజయవాడకు 15 కిలోమీటర్లు దూరంలోని పరిధిలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్ల తొలి దశ ప్రక్రియ ముగిసింది. సర్వే నెంబర్లు 205, 206, 207, 208, 214లోని దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి బిడ్లను బుధవారం నాడు సిఆర్‌డిఎ అధికారులు తెరిచారు. నిర్మాణానికి సంబంధించి రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండు బిడ్లను రెండు కంపెనీలు దాఖలు చేశాయి. ఒకటి ఎల్ అండ్ టి కంపెనీ కాగా, మరొకటి షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఈ బిడ్లను వేశాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నియమనిబంధనలను విధించింది. సాంకతిక పరమైన బిడ్లను అధికారులు బుధవారం నాడు తెరిచారు. కీలకమైన ఫైనాన్షియల్ బిడ్లను ఈ నెల 10వ తేదీన తెరవనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 180 కోట్ల వ్యయం కంటే తక్కువ మొత్తాన్ని ఎవరు కోట్ చేస్తే వారికి ఎల్-1 టెండర్ కింద కాంట్రాక్టు ఇవ్వనున్నారు. సర్కార్ 80 కోట్ల రూపాయిలను ఎపిసిఆర్‌డిఎకు ఇవ్వనుంది. మిగిలిన 80 కోట్లను సిఆర్‌డిఎ హడ్కో నుండి రుణంగా తీసుకుంటుంది. ఈ మొత్తాన్ని సిఆర్‌డిఎ 15 నుండి 20 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కాంట్రాక్టును సిఆర్‌డిఎ కుదుర్చుకుంటుంది. గడవులోగా భవనాలను నిర్మించలేకపోతే సంస్థకు జరిమానా విధిస్తారు. అనుకున్న గడువు కంటే ముందే భవనాలను నిర్మించినట్టయితే వారికి ఒక శాతం అదనంగా డబ్బు చెల్లిస్తారు. కాగా తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. వెలగపూడి భూముల్లోనే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించేలా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో మంగళగిరి టౌన్‌షిప్‌లో భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత డిసెంబర్ 29న ఇచ్చిన జీవో 278లో 20 ఎకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మాణాలకు 180 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ భవన నిర్మాణాలు సంప్రదాయ పద్ధతిలో లేదా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సౌకర్యం కల్పించింది.