ఆంధ్రప్రదేశ్‌

ఇక ఆమరణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ల సాధనకు ఆమరణ నిరాహార దీక్షకే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి విస్పష్టమైన హామీ వస్తేనే దీక్ష విషయంలో పునరాలోచన ఉంటుందని ముద్రగడ తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిబద్ధత విషయంలో ముద్రగడను ఒప్పించేందుకు..దీక్ష యోచనను విరమింపజేసేందుకు ప్రభుత్వం తరపున చివరి క్షణం వరకూ జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు.
తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ వెనుదిరిగేది లేదని తేల్చిచెప్పిన ముద్రగడ శుక్రవారం ఉదయం తన ఇంట్లోనే సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వెల్లడించారు. టిడిపి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కిర్లంపూడిలో గురువారం రాత్రి ముద్రగడతో సుదీర్ఘ చర్చలు జరిపారు. సుమారు గంటన్నర పాటు ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా కాపులను బీసీలలో చేర్చేందుకు, కాపు ఫెడరేషన్లకు ఏడాదికి వెయ్యి కోట్ల వంతున గత రెండు సంవత్సరాల్లో రెండు వేల కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు ముద్రగడకు వివరించారు. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నేరుగా తనకు స్పష్టం చేసిన తర్వాతే ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటానని ముద్రగడ వీరికి ముఖ్యమంత్రి ఎన్నికల హామీల అమలు కోసమే తాను ఈ దీక్షను చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. కాగా, అంతకు ముందు చర్చలు ముగిశాక టిడిపి ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వరరావు విలేఖరులతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అయితే తాము ప్రభుత్వ ప్రతినిధులుగా రాలేదని, ముద్రగడను వ్యక్తిగతం కలవడానికి మాత్రమే వచ్చామని చెప్పారు. కాపుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ముద్రగడను ఆమరణ నిరాహార దీక్ష మానుకోవాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ముద్రగడ మాట్లాడారు. తుని ఘటనపై అవసరమైతే సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. ఆమరణ నిరాహార దీక్ష విషయంలో ఎటువంటి మార్పు లేదని, తన నిరాహార దీక్షకు అడ్డు తగలొద్దని స్పష్టం చేశారు. తన భార్య పద్మావతితో సహా తన స్వగృహంలోనే దీక్షకు కూర్చుంటానని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాను కోరుతున్నానని ఇంతకు మించి తానేమీ డిమాండ్ చేయడం లేదని ముద్రగడ తెలిపారు. తమ డిమాండ్ల అమలుకు సంబంధించి ముఖ్యంగా కాపు ఫెడరేషన్లకు 1900కోట్ల కేటాయింపు విషయంలో రాజముద్రతో వస్తేనే తన ఆలోచనను పునరాలోచించుకుంటానన్నారు.

చిత్రం... గురువారం రాత్రి ముద్రగడతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న
టిడిపి ప్రతినిధులు తోట త్రిమూర్తులు, బోండ ఉమా, బొడ్డు భాస్కర రామారావు