తెలంగాణ

చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో బిసిలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని, కాపులను బిసిలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బిసి గర్జన సదస్సు విచ్చేసిన ఆయన ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బిసి జాబితాలో చేర్చే ప్రయత్నాలను చంద్రబాబు విరమించుకోవాని డిమాండ్ చేశారు. తాను మాత్రం బాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరుతారని, తాను బిసి జాతి కోసమే పనిచేస్తున్నానని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తిని కాదని, ఎప్పుడు కూడా జెండా మోయలేదని తన ఎజెండా బిసి జాతికే ప్రాధాన్యత అని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులకు బిసి జాతి అంటే ధర్మసత్రంలా అనిపిస్తోందని, అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా చంద్రబాబు కాపుల జనాబా లెక్కలతో పాటు వారి స్థితిగతులపై అధ్యయనం చేయాలని, కాపుల ఆర్థిక పరిస్థితులు ఏంటో ఓసారి తెలుసుకోవాలని, ఇప్పటికే వారు అభివృద్ధి చెందిన వారిలో ముందు వరుసలో ఉన్నారని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన పథకం బిసి జాబితా కాదని, అలా నాయకులు అనుకుంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా కాపులను బిసి జాబితాలో చేరిస్తే రాజకీయంగా మిగతా కులాలు కనుమరుగు కావడం ఖాయమని ఆయన అన్నారు. దేశంలో బిసి జాబితాలో చేర్చాలని ఎన్నో కులాలవారు ఎందరో పోరాటాలు చేస్తున్నారని, గుజ్జర్లు, పటేల్ తదితరులు పలు రాష్ట్రాలలో రోడ్లపైకి వచ్చి ఉద్యమాల పేరిట ఆందోళన చేస్తే రాజకీయ పార్టీలు వారికి వత్తాసు పలకడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్తానని చెప్పారు. సామాజికంగా కాపులు ఇప్పటికే ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు బిసి వర్గాల అభివృద్ధికై 17 అంశాలను పొందుపరిచారని రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారని, ముందుగా వాటిపై దృష్టి సారించాలని, కాపులను బిసిలో చేర్చేందుకు బాబుతో పాటు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కృష్ణయ్య హితవు పలికారు.

మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిసి
సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య