రాష్ట్రీయం

ఈపీఎఫ్ పెన్షన్ 7500 చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ఈపీఎఫ్ పెన్షన్ సీలింగ్‌ను గడిచిన 23 ఏళ్ల నుంచి పెంచకుండా, అందులో డీఏ కలపకుండా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నష్టం జరుగుతోందని ఆలిండియా ప్రైవేటు సెక్టార్, ప్రైవేటు ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. సురేశ్ ముదిరాజ్ ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్‌తో కార్మికులు ఎన్నో రకాలుగా ఆందోళనలు చేపట్టిన తర్వాత చివరకు పార్లమెంటులో చర్చానంతరం రూ.1500 సీలింగ్ పరిమితిని పెంచి, ఇంటెరిమ్ పెన్షన్‌గా రూ.5వేలు చేయటానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నందున ఈ పెన్షన్ 1995 నుంచి అమలు చేయాలని కోరారు. ఈ మొత్తానికి డీఏను కలిపి రూ. 7500గా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని ఓ ప్రకటనలో కోరారు.