రాష్ట్రీయం

ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రాల ఆదాయ వనరులు, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు పరిమితిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దీనివల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద ఉపశమనం లభించింది. ఆర్ధిక లోటు, పెరిగిన వ్యయ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సును పెంచడం వల్ల తాత్కాలిక కష్టాల నుంచి గట్టెక్కినట్లయింది. రాష్ట్ర విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వేస్ అండ్ మీన్స్ కింద రూ.1320 కోట్లు తీసుకునే అవకాశం ఉండేది. ఈ పద్దు కింద అడ్వాన్సుగా తీసుకున్న సొమ్మును మూడు నెలల్లో ఆర్‌బిఐకు చెల్లించాలి. రాష్ట్ర విభజన తర్వాత వేస్ అండ్ మీన్స్ కింద ఆంధ్రాకు గరిష్ట స్ధాయిలో రూ.770 కోట్లు, తెలంగాణకు రూ.550 కోట్లను అడ్వాన్సుగా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్‌బిఐ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల వేస్ అండ్ మీన్స్ వల్ల ఆంధ్రాకు రూ.770 కోట్ల నుంచి రూ.1510 కోట్ల వరకు, తెంలగాణ రూ. 550 కోట్ల నుంచి రూ.1080 కోట్ల వరకు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ అడ్వాన్సుపై 6.75 శాతం వడ్డీని రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలు దాటిని తర్వాత చెల్లిస్తే అదనంగా ఒక శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ కింద నిర్దేశించిన పరిమితిని దాటి సొమ్మును డ్రా చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్‌ను 14 వర్కింగ్ దినాల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ తాజా నిర్ణయం వల్ల 14వేల కోట్లరూపాయల లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్ధితుల్లో ఆర్‌బిఐ నుంచి వేస్ అండ్ మీన్స్ కింద డ్రా చేసి బకాయిలు చెల్లిస్తోంది.