రాష్ట్రీయం

కిక్కిరిసిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: సంక్రాంతి పండుగ కోసం స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న వారి వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయంది. ముందస్తుగా రంగంలోకి దిగిన జిఎంఆర్ సంస్థ శుక్రవారం అదనపు సిబ్బందిని నియమించి మొత్తం 16గేట్లలో ఆంధ్ర వైపుకు వెళ్లేందుకు 12గేట్లు తెరిచి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. రాత్రి వేళ అయ్యేసరికి వాహనాల రద్దీ మరింత పెరిగిపోగా టోల్‌గేట్ల వద్దట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుంది. కేతెపల్లి మండలం కొర్లపహడ్ టోల్ గేట్ వద్ధ సైతం 12గేట్లకుగాను విజయవాడ వైపు ఎనిమిది గేట్లు తెరిచి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. హైద్రాబాద్ వైపు నాలుగు గేట్లను తెరిచారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపైన మాడ్గులపల్లి టోల్‌గేట్ వద్ధ సైతం మొత్తం ఏడు గేట్లకుగాను ఏపి వైపు నాలుగు గేట్లను, నార్కట్‌పల్లి వైపు మూడుగేట్లను తెరిచారు. ప్రమాదాలు తలెత్తకుండా పోలీస్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టారు