రాష్ట్రీయం

కూచిభొట్ల సునయనకు ట్రంప్ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: గత ఏడాది అమెరికాలో కాన్సస్‌లో జరిగిన జాతి వివక్ష దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ టెక్నోక్రాట్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్యకు అరుదైన గౌరవం లభించింది. జనవరి 30న అమెరికాలో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ కార్యక్రమం జరగనుంది. యుఎస్ నేవీలో పనిచేసిన ఆడం పురింటన్ గత ఏడాది ఫిబ్రవరి 22న ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్‌లో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్(32) మరణించగా, ఆయన స్నేహితుడు అలోక్ మేడసాని గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూచిభొట్ల సతీమణి సునయనకు ఆహ్వానం అందింది. ఆమెను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్ యోడర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కూచిభొట్ల మరణంతో సునయన అమెరికాలో తన పౌరసత్వాన్ని కోల్పోయారు. శ్రీనివాస్ మరణించే సమయానికి ఆయన హెచ్-1బి వీసాపై ఉండగా, ఆయన డిపెండెండ్‌గా సునయన హెచ్ 4 వీసాపై అమెరికాలో నివసిస్తున్నారు. అయినప్పటికీ అమెరికాలో నివసించేందుకు అనుమతి పొందారు. సునయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం గురించి కెవిన్ మీడియాతో మాట్లాడారు. భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వలసదారులను ఆహ్వానించేందుకు కూడా అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. కూచిభొట్ల వర్ధంతి సందర్భంగా సునయన త్వరలోనే భారత్ రానున్నారు. అమెరికాలో తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి తనకు పూర్తి మద్దతు లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సునయన చెప్పారు.