రాష్ట్రీయం

ఇక ఆంధ్ర వ్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 13: రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు అయ్యే ఐటి రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని, 2029 నాటికి ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.350 కోట్లతో రేణిగుంట-శ్రీకాళహస్తి మార్గంలో 150 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన జోహో సాఫ్ట్‌వేర్ సంస్థ శనివారంనాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఐటి రంగానికి సంబంధించి ఎక్కడ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని, ఈక్రమంలో హైదరాబాదులో సైబర్ టవర్‌ను నిర్మించామని, ఫలితంగా అభివృద్ధి వేగవంతమైందన్నారు. అటు తరువాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రం విడిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సైబరాబాద్‌లను ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగా ఎకో సిస్టమ్ ద్వారా వైజాగ్, విజయవాడ, అమరావతి, తిరుపతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అనంతపురాన్ని పరిశ్రమలకు ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ఎస్వీయూ, ఐఐటి, ఐజర్ వంటి విద్య, సాంకేతిక రంగాలు ఉండటం వల్ల తిరుపతిని నాలెడ్జ్‌హబ్‌గా మార్చడానికి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. ఈక్రమంలో కరకంబాడి రోడ్డులో ఐటి సంస్థల ఏర్పాటుకు 8 కంపెనీలు ముందుకురావడం శుభసూచకమన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఉదారంగా రాయితీలు ఇస్తుందన్నారు. వేగంగా అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం చూపుతున్న చొరవతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఐటి రంగం ఏర్పాటుకు తీసుకుంటున్న చొరవను, కల్పిస్తున్న సౌకర్యాలను చూసి, ప్రపంచంలోని ఐటి సంస్థలు ఏపీవైపు చూస్తున్నాయని చెప్పారు. ఇది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. గత సంవత్సరం మే 8న సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జోహో ప్రతినిధి శ్రీ్ధర్ స్పందించి ఇక్కడికి కార్యాలయాన్ని తీసుకువచ్చారని తెలిపారు. తిరుపతి ఐటి హబ్‌గా రూపుదిద్దుకోనుందని, ఇందుకు జోహోతోనే నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలో ఐటి నిపుణులలో నలుగురిలో ఒకరు ఈ దేశస్థులని, ఆ నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని చెప్పారు. రాష్ట్రంలో ఒక కోటి మందిని ఐటి శాఖ ద్వారా డిజిటల్ లిటిరేటర్స్‌గా చేస్తామన్నారు. 2019 నాటికి ఐటి రంగంలో ఒక లక్ష ఉద్యోగాలు, హార్డ్‌వేర్ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికే రేణిగుంట కేంద్రంగా ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1, 2గా చేపట్టి 1లో సెల్‌కాన్, కార్బన్ కంపెనీలు స్థాపించినట్లు తెలిపారు. 2లో డిక్సాన్ రూ.350 కోట్లు పెట్టుబడితో 1200 మందికి ఉపాధి కల్పించారని, మరో 3,300 మందికి త్వరలోనే ఉపాధి వస్తుందన్నారు. నేడు ప్రారంభిస్తున్న జోహోతోపాటు తిరుపతిలో డిసగ్నేటెడ్ టెక్నాలజీ సెంటర్‌లో మరో 7 సాఫ్ట్‌వేర్ కంపెనీలు 1800 మందికి ఉద్యోగాలు కల్పించిన వాటిని కూడా ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు. మానవ వనరులు అధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని, అనంతపురంలో కూడా ఐటి పార్కుకు నాంది పలికామని, బెంగళూరు విమానాశ్రయం నుంచి బెంగళూరు పట్టణంలోకి వెళ్లాలంటే 2 గంటలు సమయం పడుతుందని, అదే అనంతపురం ఐటి పార్కుకు చేరుకోవాలంటే 45 నిమిషాలలో చేరుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలోని జోహో కేంద్రాల్లోకెల్లా తిరుపతి కేంద్రాన్ని ఉత్తమ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. ఎక్కడ భూమి కావాలన్నా, ఎంతకావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురంలను ఐటి హబ్‌లుగా తీర్చిదిద్దుతామని, ప్రతి జిల్లాలో ఒక ఐటీ టవర్ కట్టాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, జోహో సీఈఓ శ్రీ్ధర్, ఈ కార్యక్రమంలో ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జోహో ప్రచార ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఐటి హబ్‌గా తిరుపతి
నారా లోకేష్ ఆహ్వానం మేరకు రేణిగుంటలో 200మంది ఉద్యోగులతో జోహో సంస్థ ప్రతినిధులు 200 మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం అద్ద్భెవనంలో ఉన్న తాము త్వరలోనే సొంత భవనాన్ని నిర్మించుకోనున్నట్లు జోహో ప్రతినిధులు తెలిపారు. రూ. 350 కోట్లతో ఏర్పాటయిన జోహో రానున్న 3 యేళ్లలో 5000 మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. కరకంబాడి రోడ్డులోని మానస సరోవర్ వద్ద ఏర్పాటుచేసిన డిసిగ్నేటెడ్ ఐటీ హబ్‌కు ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని వేశారు. ఏజీఎస్ హెల్త్ మెడికల్ కోడింగ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్‌లను ఈ సంస్థ అందించనుంది. 260 మంది ఉద్యోగస్తులతో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. 73మంది ఉద్యోగస్తులతో తన కార్యకలాపాలు ప్రారంభించనున్న పారికర్ సాఫ్ట్‌వేర్ సంస్థను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎక్సాఫ్లూయన్స్ కంపెనీని కూడా ఆయన ప్రారంభించారు. 20 మంది ఉద్యోగస్తులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. 20 మంది ఉద్యోగస్తులతో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్న నెస్‌కంపెనీని, 30 మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్న ఎఎన్‌ఎస్ కంపెనీని, 10 మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్న వైఐఐటీ సంస్థను, 20 మంది ఉద్యోగులతో కార్యకలాపాలుప్రారంభించనున్న ఇంజెనిసీస్ సంస్థను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

చిత్రం..జోహో సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభం సందర్భంగా జరిగిన సమావేశంలో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు