రాష్ట్రీయం

ఒకే రోజు పట్టాదార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2018 మార్చి 11న ఒకే రోజు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు రైతులకు ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. కొత్తపాస్‌పుస్తకాల జారీ, భూసర్వే, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై ప్రగతిభవన్‌లో శనివారం దాదాపు ఎనిమిది గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. కొత్తపాస్‌పుస్తకాల పంపిణీని ప్రారంభించాలంటూ రాష్టప్రతి లేదా ప్రధానమంత్రిని ఆహ్వానిస్తామన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. ఈ ప్రక్షాళన తర్వాత భూముల సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. కోర్‌బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్‌సైట్ నిర్వహిస్తామని, దీనికి ‘ధరణి’ అనే పేరు ఖరారు చేశామని కెసిఆర్ పేర్కొన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం పారదర్శకంగా ఉంటుందని, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని వివరించారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా మార్చి 11 నుండే ప్రారంభిస్తామన్నారు. అదే రోజు తహశీల్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై
భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. రెండు శాఖల మధ్య సమన్వయం సాధించేందుకే భూపరిపాలన డైరెక్టర్‌గా కొనసాగుతున్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు సిఎం తెలిపారు.
త్వరలో పార్ట్ ‘బి’
తెలంగాణలో వంద రోజుల పాటు నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన పార్ట్ ‘ఎ’ విజయవంతమైందని కెసిఆర్ తెలిపారు. 90 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. భూముల యజమానులు ఎవరో తేలిందని, ఈ వివరాలకు అనుగుణంగానే కొత్త పాస్‌పుస్తకాలు, ఎకరానికి నాలుగువేల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. పార్ట్ ఎ ప్రకారం రైతుల ఖాతాలు 71 లక్షలుగా ఉన్నట్టు తేలిందన్నారు. కోర్టు కేసులు, వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను పార్ట్ బి లో చేర్చామని, త్వరలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ధరణి
భూరికార్డుల వెబ్‌సైట్ ‘ధరణి’ ని కోర్‌బ్యాంకింగ్ తరహాలో నిర్వహిస్తామని సిఎం తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటి విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల వివరాలు, పేరుమార్పిడి వివరాలు అదే రోజు ధరణిలో నమోదవుతాయన్నారు. విదేశాల్లో ఉన్నవారు కూడా ధరణి ద్వారా క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చన్నారు. తహశీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 584 మండలాలు ఉండగా, 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు. 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు యధావిధిగా కొనసాగతాయని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న మండలం పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ చేస్తారన్నారు. మిగతా 443 మండలాల్లో తహశీల్దారులకే సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగిస్తామన్నారు. తహశీల్దారులు లేకపోతే ఆ బాధ్యత డిప్యూటీ తహశీల్దారులు నిర్వహిస్తారని వివరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
ఇవీ సంస్కరణలు
* భూములు అమ్మేవారు, కొనేవారు పరస్పరం అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌ను అపాయింట్‌మెంట్ టైం (పాస్‌పోర్టులు, వాహనాల రిజిస్ట్రేషన్ల తరహాలో) అడగాలి.

* భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను లైసెన్స్‌డ్ డాక్యుమెంట్ రైటర్లు రాసిన కాగితాలను సబ్‌రిజిస్ట్రార్లు అనుమతిస్తారు.

* అమ్మేవారు, కొనే వారు స్వయంగా డాక్యుమెంట్లు రాసుకున్నా రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.

* అపాయింట్‌మెంట్‌రోజు అమ్మేవారు, కొనేవారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరు కావాలి.

* ఇరువురి వేలిముద్రలు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు.

* కొత్తపాస్‌పుస్తకాల్లో కొత్తవారిపేర్లతో భూముల రిజిస్ట్రేషన్ వివరాలు పొందుపరుస్తారు.

* ఇద్దరి పాస్‌పుస్తకాలను అదే రోజు తహశీల్దార్లకు పంపిస్తారు.

* తర్వాత భూముల మ్యుటేషన్ (మార్పిడి) పూర్తవుతుంది.

* అధికారిక పాస్‌పుస్తకాలు కొరియర్‌లో పంపిస్తారు.

చిత్రం..ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్