రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్నకు భృంగి వాహనసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మల్లికార్జున స్వామికి భృంగి వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి హారతి ఇచ్చారు. భక్తుల జయజయధ్వనాల మధ్య స్వామివారి గ్రామోత్సవం ఆలయ మాడా వీధుల్లో కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకుని పునీతులయ్యారు. వాహనసేవ ముందు కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో నారాయణ భరత్‌గుప్తా దంపతులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.