రాష్ట్రీయం

మూడు రకాలుగా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ఇంతకాలం బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికే పరిమితమైన గృహ నిర్మాణ శాఖ తన స్వరూపాన్ని మార్చుకోనుంది. బడుగు, బలహీనవర్గాల వారికి సైతం ఇళ్ల నిర్మాణం చేపట్టినపుడు అందంగా ఆకర్షణీయమైన ఇళ్లను నిర్మించడంతోపాటు కొత్త రాజధానిలో ఉద్యోగులకు సైతం ప్రత్యేకించి గృహాల నిర్మాణాన్ని చేపట్టినపుడు ఆధునిక వసతులతో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. చైనా, హాంకాంగ్, సింగపూర్‌లలో గృహ నిర్మాణాలపై ఏపీ అధికారుల బృందం ఇటీవల అధ్యయనం చేసిన తర్వాత, మన దేశంలో కూడా కనీసం నాలుగు ఆదర్శవంతమైన ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇకమీదట మూడు కేటగిరిల్లో గృహ నిర్మాణం చేపడతారు. అందులో ప్రభుత్వోద్యోగులకు, ప్రైవేటు, అసంఘటిత కార్మికులకు వేర్వేరుగా నిర్మాణాలు చేపడతారు. ఈ మూడు కేటగిరిల గృహాల నిర్మాణం కూడా ఒకేచోట జరుగుతుంది. గతంలో నిర్మించినట్టు చేస్తే అవి పూర్తికాకపోవడం, కొంతకాలానికి మురికివాడలుగా మిగిలిపోవడంతో నిష్ప్రయోజనం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. గృహనిర్మాణ శాఖ కేవలం కాంట్రాక్టర్ పాత్ర నుంచి తన రూపాన్ని మార్చుకుంటోంది. వర్కుషాప్‌లను నిర్వహించి నాణ్యత, టెక్నాలజీ, హౌసింగ్ మోడళ్లపై ప్రత్యేకంగా ఎప్పటికపుడు చర్చించడం, అందులో వచ్చిన విషయాలను క్రోడీకరించి సమగ్ర నివేదికలను తయారు చేయడం వల్ల రానున్న ప్రాజెక్టుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకంటారు. లే అవుట్‌ల తయారీకి ప్రైవేటు కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 13 జిల్లా కేంద్రాల్లో 50 గృహాలు చొప్పున నమూనా ఇళ్లను మల్టిపుల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తారు.
హుదూద్ తుఫాను బాధితులకు ఈ టెక్నాలజీ వినియోగించి 3400 ఇళ్లన ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ పథకం కింద నిర్మించనున్నారు. ఇప్పటికే నిర్మించిన దాదాపు 1.5 లక్షల ఇళ్ల మరమ్మతులకు లబ్దిదారులకు 10 వేల రూపాయిల వరకూ ప్రభుత్వం సాయం అందిస్తుంది. అలాగే రాష్టవ్య్రాప్తంగా అసలు ఇళ్లులేని వారి జాబితాలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తారు. రానున్న రోజుల్లో వారికి ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అసంతృప్తిగా ఉన్న 1.19 లక్షల ఇందిరా ఆవాస్ యోజన గృహాలకు మాత్రం కేంద్రం నిధులనే వెచ్చించనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మెగాపార్కు ఫర్ కనస్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్విప్‌మెంట్ హబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రెండు జిల్లాల్లో ఆరు వేల ఎకరాలను కేటాయిస్తారు. సిరామిక్స్, శానిటరీవేర్, కనస్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, ఆర్కిటెక్చర్ , ఎడ్యుకేషన్ హబ్‌లకు సైతం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని గృహనిర్మాణ శాఖ అధికారి ఒకరు చెప్పారు.