రాష్ట్రీయం

ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే స్టేషన్లలో ఏర్పాట్లు, ప్రయాణీకులకు సౌకర్యాలు, రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను ఆయన సందర్శించారు. బుకింగ్ కౌంటర్లు, కేటరింగ్ స్టాల్స్, స్టేషన్ పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖ వెళ్లే ఒక రైలు కోచ్‌లను కూడా ఆయన పరిశీలించారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులు కొందరితో మాట్లాడారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న లిఫ్ట్, ఎస్కలేటర్లు పనితీరును అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే అధికారులు నిరంతరం రద్దీని పర్యవేక్షించాలని, తదనుగుణంగా రైళ్ల ఏర్పాట్లు చేయాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. కాచిగూడ నుంచి బయలుదేరుతున్న ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల వెళుతున్నందున వాటి రాకపోకల గురించి స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టిక్కెట్లు దొరక్క క్యూ లైన్‌లో నిలబడి ఉన్నవాళ్లకు ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. జిఎం వెంట హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కమ్మర్షియల్ మేనేజర్ ఎం.జి శేఖరం, అదనపు చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ జిఎం ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.

చిత్రం..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్.