రాష్ట్రీయం

రైతుతోనే సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 14: కొత్త పంటలు ఇంటికొచ్చే వేళ, ధనధాన్యాలు, కొత్త దుస్తులు, పిండివంటలతో ప్రజలంతా సంతోషంగా చేసుకునే పండుగ సంక్రాంతి. ఇది తెలుగు ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నం పెట్టే అన్నదాతలకు కానుక ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సహకారంతో విద్యుత్‌ను ఆదాచేసే రూ. 40వేల విలువైన పంపుసెట్లను ఉచితంగా అందచేయనున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన ఇంధన శాఖ అధికారులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఇదో విప్లవాత్మక నిర్ణయమని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఈ పంపుసెట్లను రైతులు ఇంట్లో కూర్చునే ఆన్, ఆఫ్ చేయొ చ్చు. ఇది మరో విశేషం. మొత్తం రాష్టవ్య్రాప్తంగా 15లక్షల పాత పంపుసెట్లను మార్చేసి వాటి స్థానంలో దశలవారీగా ఇంధన సామర్ధ్య, సోలార్ పంపుసెట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘రైతే రాజు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు కళ్లల్లో ఆనందం చూడాలి. అందుకే రైతులకు రూ. 40వేల విలువైన ఇంధన సామర్ధ్య పంపుసెట్లను ఉచితంగా అందజేసి ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ప్రకటించడం నాకు గర్వంగా ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘మొబైల్‌తో ఆపరేట్ చేసేందుకు సిమ్ కార్డుతో కూడిన స్మార్ట్ ప్యానల్ ఉన్న 5స్టార్ రేటింగ్ ఈఈ పంపుసెట్లు అందించటం వల్ల రైతులకు లాభం జరుగుతుంది. ఈ పంపుసెట్లకు ఐదేళ్ల వరకు ఎలాంటి నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు ఉండవు. పంపుల్లో లోపం తలెత్తితే వెంటనే ఎస్‌ఎంఎస్ వచ్చే వ్యవస్థ ఉంటుంది. దాదాపు 30శాతం విద్యుత్
ఆదా అవుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త పంపుసెట్ల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అర్ధరాత్రిళ్లు పొలాలకు వెళ్లడం, పాముకాట్ల వంటి ప్రమాదాలు తప్పుతాయన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 4లక్షల పాత పంపుసెట్ల స్థానంలో కొత్తవాటిని అమర్చేందుకు డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయన్నారు. ‘మా ప్రభుత్వానికి రైతే సుప్రీం. తొలి ప్రాధాన్యం రైతు సంక్షేమానికే. ఓ రైతుబిడ్డగా ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి పొలానికీ సాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. అలాగే పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో సాగునీటి వెతలు తీరిపోయాయి. చిట్టచివరి భూములకు కూడా సాగునీరు అందిస్తాం. ఆ నమ్మకం నాకుంది’ అని చెప్పారు. నదులు, కాలువలు, వ్యవసాయ పంపుసెట్ల ద్వారా పుష్కలంగా నీరు అందిస్తే మన రైతులు పంటల దిగుబడిలో అద్భుతాలు సృష్టిస్తారని, దేశానికే ఆదర్శంగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు. ఇంధన సామర్ధ్య పంపుసెట్లకు తోడు ప్రభుత్వం రైతులకు కొత్తగా సౌర పంపుసెట్ కనెక్షన్లను కూడా అందించనుంది. భూగర్భ జలాలు 75 మీటర్లలోపు ఉన్న ప్రాంతాల్లో వీటిని అందజేస్తారు. మొత్తం రూ. 3.12 లక్షలు ఖర్చయ్యే ఈ కనెక్షన్లకు ప్రభుత్వం రూ. 2.57 లక్షల రూపాయలు భరిస్తుంది. రైతులు కేవలం రూ. 55వేలు చెల్లిస్తే సరిపోతుంది. వీటితోపాటు ఒక్కో పంపుసెట్‌కు రూ. లక్ష వ్యయంతో హైవోల్టేజీ సరఫరా వ్యవస్థ కలిగిన 9,62,712 పంపుసెట్లను కూడా అందిస్తారు. వీటివల్ల ఓల్టేజీ హెచ్చుతగ్గులు లేకపోవడంతో పాటు మోటార్లు కాలిపోయే ప్రమాదం కూడా తప్పుతుంది. పంపింగ్ సామర్ధ్యం 15 శాతం ఎక్కువగా ఉండడం వల్ల పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు 20వేల సోలార్ పంపుసెట్లు అమర్చామని, 2018-19లో మరో 10 వేలకు పైగా అమర్చుతారని విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఈసందర్భంగా బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఉచిత విద్యుత్ వినియోగంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో పంపుసెట్‌పై రాయితీ కింద ఏటా రూ. 25వేలు వెచ్చిస్తోంది. కొత్తగా అందించే వౌలిక సదుపాయాల వల్ల ఈ మొత్తం రూ. లక్షకు చేరనుంది. విద్యుత్ రంగంలో ఏటా ఒక్కో రైతుకు రూ. 1.60 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరిగినందున విద్యుత్ సంస్థలు రైతులకు నాణ్యమైన కరెంట్ సరఫరాను కొనసాగించాలని ఆదేశించారు. రైతుల సంతృప్తే పరమావధిగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 2014 నుంచి రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అవుతుండటంతో వ్యవసాయ వృద్ధి గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2015-16, 2016-17 సంవత్సరాల్లో వృద్ధిరేటు 10.95 శాతం, 11.61 శాతంగా నమోదైందన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగ వృద్ధిరేటు దేశం మొత్తం మీద కేవలం 2.3 శాతం ఉండగా రాష్ట్రంలో మాత్రం 27.6 శాతం నమోదైందని, రెండో త్రైమాసికంలో 17.13శాతంగా నమోదవడం విశేషమని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా రూపొందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలకు నీటి భద్రతపై భరోసా కల్పిస్తేనే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
చిత్రం..శ్రీవారి ఆలయంలో ధ్యానంలో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు