రాష్ట్రీయం

ఖైదీల శ్రమైక క్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: ఖైదీలం అయతేనేం... ఫర్నిచర్ తయారీలో ఎవరికీ తీసిపోం అంటున్నారు వారు.. తమ చేతిచలువతో అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయడమే కాకుండా ఏకంగా కోట్లలో ఆర్డర్ సంపాదించారంటే మాటలేం కాదు.. ఇందుకు జైలు అధికారుల ప్రోత్సాహం కూడా మరువలేనివంటారు వారు. వీరంతా సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఖైదీల కథ. ఒకటి కాదు.. రెండు కాదు.. రకరకాల వ్యాపారాలపై దృష్టి సారించిన తెలంగాణ జైళ్ల శాఖ అనతికాలంలోనే అబ్బురపరిచే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇందులో సంగారెడ్డి జైలు అధికారులు తామేమీ తక్కువ కాదన్నట్టుగా వివిధ వ్యాపారాలపై దృష్టిని కేంద్రీకరించారు. నర్సరీల్లో మొక్కలు పెంచడం, ఇటుకల తయారీ, సిమెంటు రింగులు, చేనేత వస్త్రాల విక్రయం, ఫినాయిల్ తదితర వాటిని ఖైదీల ద్వారా తయారు చేయించి విక్రయిస్తూ వ్యాపారాన్ని లాభసాటిగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన స్టీలు సామాగ్రి తయారీలో అద్భుత విజయాన్ని సాధించారు. ప్రారంభించిన ఏడాదిలోనే 82 లక్షల టర్నోవర్ చేశారంటే అధికారుల నిబద్ధతకు నిదర్శనంగా
చెప్పవచ్చు. జిందాల్, టాటా స్టీల్‌ను టెండర్ల ప్రక్రియ ద్వారా ముడి సరుకును కొనుగోలు చేసుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడంతో పాటు చదువుకోవడం, రాసుకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా బెంచీలు తయారు చేయించి విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన బెంచీలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కొనుగోలు చేయగా, నాణ్యతను పరిశీలించిన తర్వాత ఆదిలాబాద్ కలెక్టర్ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయడం విశేషం. విద్యార్థుల కోసం బెంచీలు మాత్రమే కాకుండా కార్యాలయాల్లో ఉపయోగించే బీరువాలు, ఇళ్లలో ఉపయోగించుకునే బీరువాలను కూడా తయారు చేయిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలను పెట్టుకునేందుకు, వ్యాపార కేంద్రాల్లో వస్తు, సామాగ్రిని అమర్చుకునేందుకు అనువుగా ఉండే ర్యాక్‌లు, స్టూళ్లు, కార్యాలయాల టేబుళ్లను కూడా తయారు చేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రూ.1.22 కోట్ల ఆర్డర్ వచ్చిందని జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ రాయ్ స్పష్టం చేసారు. జీవిత ఖైదీలతో పాటుగా రిమాండ్ ఖైదీలు కూడా పనిచేస్తూ ఖాళీగా ఉండకుండా సంపాదించుకుంటున్నారు. తూప్రాన్‌కు చెందిన అశోక్ అనే ఖైదీ ఫర్నిచర్‌ను తయారు చేయడంలో నిష్ణాతుడయ్యాడు. రోజుకు 70 రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. జైలుకు రాకముందు వ్యవసాయం చేసేవాడినని, జైలు నుండి విడుదలై ఇంటికి వెళ్లాక ఈ పని చేసుకుని ఉపాధి పొందుతానని సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఇతర ఖైదీలకు కూడా వారు చేపట్టే పని ఆధారంగా రోజుకు రూ.50, రూ.40 చొప్పున చెల్లిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో పెంచేందుకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచేందుకు కూడా అనుమతులు వస్తున్నాయని జైలు అధికారులు తెలిపారు. సువిశాలంగా ఉన్న జైలు ఆవరణలో దాదాపుగా 15 వేల కలబంద మొక్కలను పెంచుతున్నారు. ఎకరా స్థలంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లభించినట్లు జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేసారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులను ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయించి విక్రయింపజేస్తున్నామని వివరించారు. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పేర్కొన్నట్లుగానే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తమకు తామే సమకూర్చుకుంటామని చెప్పిన మాట అక్షర సత్యం చేస్తున్నారు.
*
చిత్రాలు..ఫర్నిచర్ తయారీలో నిమగ్నమైన ఖైదీలు
*పాఠశాలలో విద్యార్థుల కోసం అమర్చినట్లుగా కనిపిస్తున్న బెంచీలు