రాష్ట్రీయం

కుల గొబ్బెమ్మల వేడుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏ కులమైనా పూర్తిగా ఒకే పార్టీకి ఓట్లు వేస్తుందా? అంటే చెప్పడం కష్టం. కానీ గంప గుత్తగా ఒకే పార్టీకి ఓట్లు పడకపోయినా, మెజారిటీ ఓట్లు పడేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆయా పార్టీలు ఇచ్చే హామీలు, ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతల పిలుపులు, సూచనలు కొంత వరకు పని చేస్తాయని చెప్పవచ్చు. అందుకే వివిధ పార్టీల నేతలు ఎన్నికలకు ముందు కుల సంఘాల నేతలతో మంతనాలు జరుపుతుంటారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర కూడా పూర్తిగా లేనందున, ఇప్పటికే టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వివిధ కుల సంఘాలను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వివిధ కుల సంఘాల ముఖ్య నేతలను పిలిపించుకుని హామీల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా యాదవుల నుంచి ఒకరికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. యాదవులకు ఇస్తే మరి మా సంగతేమిటీ? అని రెడ్డిలు, గొల్ల, కురమలు తదితర సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.
దీంతో ముఖ్యమంత్రి ఇటీవల రెడ్డి కుల నాయకులతో సమావేశమై రెడ్డి భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు, నిర్మాణానికి కొంత డబ్బు ఇస్తానని ప్రకటించడంతో మిగతా కులాలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలాఉండగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలు కూడా కులాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు సబ్సిడీ మొత్తాన్ని పెంచి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దళితులను ఆకర్షించేందుకు ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టుపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసేందుకు వెళ్ళి అక్కడ ఆయనతో వాగ్వావాదానికి దిగారు. నేరెళ్ళ ఘటనపైనా గవర్నర్‌ను కలిసారు. ఖమ్మం ఘటనపై నేరుగా రాష్టప్రతిని కలిసి ఫిర్యాదు చేశారు.
గౌడ్‌లను ఆకర్షించేందుకు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తును గీత కార్మికుడు మరణిస్తే, వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తాజాగా టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. మత్స, పద్మశాలి కుల నేతలతో వేర్వేరుగా మంతనాలు జరిపారు. మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలను ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా అడగులు వేస్తున్నది.