రాష్ట్రీయం

కర్షక జీవితాల్లో శుభక్రాంతి సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 14: సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయని, భోగిపండుగ కంటే ఉత్సాహంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభ సందర్భమే సంక్రాంతి అని చెపుతూ అన్నదాతల జీవితాల్లో సంక్రాంతి శుభక్రాంతి తేవాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. వ్యవసాయంతో రైతుకు రెట్టింపు లాభాలు రావాలన్న విధానంతో తాము పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తెలుగువారికి ఇది పెద్ద పండుగ అని, ప్రత్యేకించి పంటలు ఇంటికి చేరిన వేళ ప్రకృతికి, ఇష్టదైవాలైన ఇలవేల్పులకు కర్షకులు కృతజ్ఞతలు తెలిపే పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం ఎప్పుడూ ఒక సవాలేనని, అలాంటి రంగంలో సైతం మన రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు నమోదు చేస్తోందని, దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కానంతగా వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మలచాలనే ముందుచూపుతో కృషి చేస్తున్నామన్నారు. 15ఏళ్ల పాటు 15శాతం వృద్ధిరేటు సాధించాలన్నదే లక్ష్యమని, 80 శాతం ప్రజాసంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.