రాష్ట్రీయం

పునర్విభజనపై ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 16: రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కోసం నియోజవర్గాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఇటీవలి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో ఆయనకు గట్టి హామీ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 ఉన్న అసెంబ్లీ స్థానాలు 225కు పెంచాలని కోరుతూ శాసనసభ గతంలోనే తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నంతవరకూ ఆ అంశానికి సంబంధించి హోం, న్యాయ శాఖ అధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత పునర్విభజనకు సంబంధించి టీడీపీ వర్గాల్లో ధీమా పెరిగినట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. ‘సీట్ల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. ప్రధాని గతంలో ఆ అంశానికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేవారుకాదు. బాబుతో భేటీ తర్వాత ఆయన వైఖరి సానుకూలంగా మారింది. విభజన చట్టం అమలు విషయంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజనకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసిన విషయాన్ని సార్ గట్టిగా వినిపించారు. అయితే అదే డిమాండ్ ఉన్న మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధానం వర్తింపచేయాలన్న ఆలోచనతో ప్రధాని ఉన్నట్లు మాకు అనిపించింది. సమీపకాలంలో కొన్ని కీలక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో జయాపజయాల లెక్కలు, బీజేపీ భవిష్యత్తు రాజకీయ అవసరాలు కూడా మోదీ సానుకూలతకు కారణం కావచ్చు’ అని ఓ సీనియర్ ఎంపీ విశే్లషించారు. మునుపటి మాదిరిగా ఇప్పుడు ఆలస్యం జరిగే అవకాశాలు లేవని, కంప్యూటరీకరణ చేసినందున వివరాలన్నీ అందుబాటులోనే ఉంటాయని వివరించారు. మిగిలిన రాష్ట్రాల డిమాండ్లు పక్కకుపెడితే విభజన చట్టం ప్రకారంగానయినా మనకు వెసులుబాటు ఉందని ఆ ఎంపీ వివరించారు. కాగా ఇప్పటివరకూ నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాజకీయంగా తమ పార్టీకి అదనంగా వచ్చే లాభమేమీ లేదని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం పునర్విభజన అంశం అమలవుతుందని చెబుతుండటం విశేషం. ‘ఇదేదో బాబు-కేసీఆర్ పట్టుపడుతున్నారది కాదు. పార్టీ ఆలోచనలు, అవసరాలు పరిగణనలోకి తీసుకునే చేయవచ్చు’ అని ఓ బీజేపీ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, పార్లమెంట్ తొలి విడత సమావేశాల్లో ఇది రాకపోవచ్చని, మార్చి ఏప్రిల్ 9 వరకూ రెండో విడత సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రావచ్చని మరో ప్రముఖుడు చెప్పారు. మొత్తానికి వచ్చే పార్లమెంట్ సమావేశాల ముగింపు నాటికి శుభవార్త వినవచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల పట్ల బీజేపీ నాయకత్వ ధోరణి కొంతవరకూ మారిందని విశే్లషించారు.