ఆంధ్రప్రదేశ్‌

అడుగంటిపోతున్న ప్రకాశం బ్యారేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ప.గో జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతి ఏటా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ పుష్కలంగా సాగునీరందించే ప్రకాశం బ్యారేజి ప్రస్తుత రబీ సీజన్‌లో సాగుకు చుక్క నీరందించే పరిస్థితి లేకపోయినా కనీసం తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు తమంతట తాముగా వరి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించి కొద్దో గొప్పో ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నార్ల తాతారావు విద్యుత్ థర్మల్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పాదన కోసం ఏడాది పొడవునా ప్రకాశం బ్యారేజి వద్ద 12 అడుగుల స్థాయిలో కనీస నీటిమట్టాన్ని కొనసాగించాల్సి ఉంటే ఖరీఫ్ చివరి రోజుల్లో పంట ఎండిపోకుండా కాపాడేందుకు అలాగే తాగునీటి అవసరాల కోసం కాలువల నుంచి స్వల్పంగా నీటిని విడుదల చేస్తూ రావటంతో శనివారం సాయంత్రానికి నీటిమట్టం 8.6 అడుగులకు పడిపోయింది. దీంతో కాలువలన్నింటినీ పూర్తిగా కట్టివేశారు. శుక్రవారం నీటిమట్టం 8.7 అడుగులుండగా 24 గంటల్లో ఒక అడుగుకి పడిపోయింది. ఇదిలా ఉండగా జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధీనంలోనున్న 3వేల తాగునీటి చెరువులన్నీ దాదాపు ఎండుముఖం పడుతున్నాయి. అయితే ఈ నెలాఖరు వరకు జిల్లాలో తాగునీటికి ఇబ్బంది ఉండబోదని అప్పటికీ కాలువల నుంచి నీరు విడుదల కాని పక్షంలో ముందెన్నడూ లేని ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ జిల్లా పంచాయతీ అధికారిణి కృష్ణకుమారి ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. కొద్ది రోజుల క్రితం కాలువల నుంచి స్వల్పంగా విడుదల చేసిన నీరు ఆయకట్టు చివరి ప్రాంతానికి చేరకపోవటంతో కలిదిండి మండలంలో పలు గ్రామాల్లోని చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యంతో నాగార్జునసాగర్ నుంచి 5వేల క్యూసెక్కుల నీరు విడుదల కాగా ఆ నీరు బ్యారేజీకి చేరటానికి మరో మూడు రోజులు పట్టవచ్చు. ప్రస్తుతం పులిచింతల నుంచి 900 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మరో రెండు రోజులకు గాని ఆ నీరు బ్యారేజీకి చేరే పరిస్థితి కన్పించడం లేదు. నీటిమట్టం పెరిగితే కాని ఏమేర నీరు చేరుతుందో చెప్పలేం.. ఏది ఏమైనా కృష్ణాజిల్లాలో తాగునీటి ఎద్దడి పొంచి వుంది.