రాష్ట్రీయం

తల్లిదండ్రులకు బాబు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: పెద్దల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తల్లిదండ్రులైన నారా ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సంక్రాంతి పర్వదినాలను తన జన్మస్థలమైన నారావారిపల్లెలో గత పది సంవత్సరాలుగా సంబరాలు జరుపుకోవడాన్ని ముఖ్యమంత్రి ఆనవాయితీగా పాటిస్తున్నారు. 13న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు చేరుకున్న విషయం పాఠకులకు విదితమే. సోమవారం తల్లిదండ్రులకు ఇంట్లో కొత్త వస్త్రాలు పెట్టుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటికి సమీపంలో ఉన్న తల్లి నారా ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల సమాధుల వద్దకు తన సతీమణి భువనేశ్వరిదేవి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాంష్, వియ్యంకుడు బాలకృష్ణ దంపతులతో కలిసి వెళ్లి పుష్పాంజలి ఘటించారు.
చిత్రం...తల్లిదండ్రుల సమాధులవద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి