రాష్ట్రీయం

ప్రత్యక్షమా..పరోక్షమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనే అంశాన్ని చర్చిస్తున్నామన్నారు. పని చేసే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు, ఎన్నికల విధివిధానాలపై పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లును ఫిబ్రవరి మొదటి వారంలో శాసనసభలో ప్రవేశ పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే మార్చి 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రగతి భవన్‌లో మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో తీసుకురానున్న మార్పులు, ఎన్నికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి వివరించారు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు జిల్లా అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా భౌగోళిక హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25కల్లా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ పంచాయతీలకు హద్దులు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని కలక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే కొత్తవాటికి న్యాయ స్థానాల నుంచి ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పంచాయతీల ఏర్పాటు జరుగాలని సూచించారు. పంచాయతీల మీద ఒకప్పుడు కలెక్టర్‌కు ఎన్నో అధికారాలు ఉండేవి కానీ ప్రస్తుతం నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీకి ఏమేమి పనులు అప్పగించాలనే అంశం ఆలోచిస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఐదు వందల జనాభా కలిగిన గ్రామానికి రూ. 5 లక్షలు ఆ తర్వాత జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు స్థాయికి అనుగుణంగా రూ.10 లక్షలు మొదలుకొని 25 లక్షల వరకు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే రాష్టస్థ్రాయి ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసామని, ఈసారి బడ్జెట్‌లో కమిషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. జాతీయ స్థాయి ఆర్థిక సంఘం నిధులను కూడా వినియోగించుకుంటామన్నారు. ఎమ్మెల్యే, ఎంపిల నియోజకవర్గాల అభివృద్ధి నిధులను కూడా గ్రామీణాభివృద్ధికి ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. సాదా బైనామాల కోసం దరఖాస్తు వచ్చిన వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చాక మున్సిపల్ చట్టంలో కూడా తీసుకొస్తామని సిఎం వివరించారు. స్థానిక తక్షణ అవసరాల కోసం పెద్ద జిల్లాల కలక్టర్లకు రూ. 1.5 కోట్లు, చిన్న జిల్లాల కలక్టర్లకు రూ. కోటి కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.