రాష్ట్రీయం

అవకాశాలు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: దక్షిణ కొరియాలో రెండు రోజులుగా పర్యటిస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు బృందం అక్కడి పలు కంపెనీల సిఇవోలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వారికి వివరించారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఫార్మ, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని మంత్రి కోరారు. ఆటోమొబైల్ దిగ్గజం హూందయ్ కార్పొరేషన్ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు నామ్ గుహ్నోతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టిఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు కల్పించిన రాయితీలు, ప్రోత్సహకాలను మంత్రి వారికి వివరించారు. తెలంగాణలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్‌లో (మొయిబా) 500 కంపెనీలు సభ్యులుగా ఉండటంతో ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మంత్రి కెటిఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ ప్రభుత్వం కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తుందని ఇందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కొరియా టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పలు ఆసక్తి కనబరిచినట్టు మంత్రి తెలిపారు.