రాష్ట్రీయం

శాంతి భద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 16: రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలపైనే ఆధారప డి ఉంటుందని.. అందుకే ఈ విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల పోలీసు కార్యాలయాలను ఆయన సందర్శించారు. అయా జిల్లాల పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాయలంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనైనా ప్రజ లు సుఖశాంతులతో జీవించాలంటే శాంతి భద్రతలు బాగుంటేనే అది సాధ్యం అవుతుందని అన్నా రు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పోలీసుశాఖ శాం తి భద్రతలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తోం దని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. ఇక్కడికి దేశ, విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలన్నా ప్రధానంగా వారు చూసేది శాంతి భద్రతలని ఆయన వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల నుం డి ఏదైతే ఆశిస్తుందో ఆ దిశగా ప్రణాళికలు రచించుకుని పనిచేస్తామని ఆయన తెలిపారు. 2018 సంవత్సరంలో పోలీసు శాఖలో విప్లవాత్మకమైన మార్పు లు తీసుకురావడానికి వార్షిక ప్రణాళిక రూపొందించడం జరిగిందని అందుకే తాను ప్రత్యేకంగా జిల్లా ల వారీగా పర్యటనలు చేస్తున్నానని తెలిపారు. జిల్లాలో పోలీస్ అధికారులకు దశ, దిశ నిర్దేశం చేస్తున్నామని తెలిపారు. గతంలో పోలీసులంటే ప్రజల్లో ఏదో అపోహలు ఉండేవని.. వాటిని సమూలంగా రూపుమాపి పోలీస్‌స్టేషన్లను ప్రజలు దేవాలయాలుగా భావించే రోజులు రానున్నాయని డీజీపీ వెల్లడించారు. పోలీసులు అంటే ప్రజల్లో ఆత్మబంధువులుగా భావన వచ్చేలా తమ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అంది వారి జీవన విధానంలో మార్పులు తీసుకురావడంలో కూడా పోలీసుల పాత్ర ఉంటుందని తెలిపారు. ప్రస్తు తం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా నేరానికి పాల్పడితే దొరికిపోతామనే భయం వస్తుందని.. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర పోలీస్‌శాఖ ఇటీవల పలు కేసుల్లో విజయం సాధించిందని అన్నారు. రాబోయే కాలం లో మరిం త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని నేరగాళ్లు నేరాలకు పాల్పడే ఆలోచన నుండి పూర్తిగా విరమించుకునే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతమైన జీవితం గడపటానికి రాష్ట్ర పోలీసులు ఆహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. అందుకుగాను తమ వద్ద ఉన్నటువంటి అన్ని ప్రయోగాలను అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభు త్వం ఏదైతే తమ శాఖ ద్వారా ఫలితాలను ఆశిస్తుందో వాటిని వందశాతం అమలుచేసి తీరుతామని డీజీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీ అనురాధ, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి