రాష్ట్రీయం

కృష్ణా జిల్లా కలెక్టర్ విషయంలో లోకాయుక్త నిర్ణయం సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: కృష్ణా జిల్లా కలెక్టర్ 2016 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రూ.20 లక్షల సొమ్మును ఖర్చుపెట్టినందుకు ఫిర్యాదును నమోదు చేయాలన్న పిటిషన్‌ను ఏపి లోకాయుక్త తిరస్కరించడం సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏవి రమణ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పును జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన ధర్మాసనం వెలువరించింది. పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ 2016 డిసెంబర్ 27వ తేదన రాష్ట్రప్రభుత్వానికి కొత్త సంవత్సర వేడుకల నిర్వహణకు నిధులు కావాలని అడిగితే, ప్రభుత్వం రూ.20 లక్షలను విడుదల చేసిందని, ఈ నిధులతో వేడుకలను విజయవాడ హరిత బెర్మ్ పార్క్ హోటల్‌లోనిర్వహించారన్నారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లేనని, ఈ విషయమై కృష్ణా జిల్లా కలెక్టర్‌పై కేసు నమోదు చేయాలని పిటిషనర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త పరిధిలోని అంశాలను ప్రస్తావించి చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించని లోకాయుక్త ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. లోకాయుక్త ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.