రాష్ట్రీయం

కాయ్ రాజా కాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/విశాఖపట్నం, జనవరి 16: సంక్రాంతి సరదా మాటున గోదావరి జిల్లాలు మూడు రోజులపాటు కోడి పందేలతో పల్లెల్లో రద్దీగా సాగాయి. ఏటికేడాది కోర్టు తీర్పు కోసం ఎదురుచూడడం, నిర్వాహకులు పందాలు నిర్వహించేందుకు నేతలపై వత్తిడి తేవడం..షరా మామూలుగానే జరిగింది. ఈ ఏడాది కూడా యధారాజా తథాప్రజా అన్నట్లు కోడి పందేలు బరితెగించారు. ఈ మూడు రోజులపాటు సాగిన పందేల జూదం దాదాపు రూ.100 కోట్లు పైమాటేనని అనధికారిక అంచనా. అన్ని దారులూ కోడి పందేలవైపే అన్నట్టుగా కనిపించాయి. ఏ ఈడాది మరింత ఆసక్తికరంగా కోడి పందేలు సాగాయి. జిల్లాలో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, ఐ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఆత్రేయపురం, కొత్తపేటతోపాటు మెట్టలోని కోరుకొండ, గోకవరం, మైదాన ప్రాంతంలోని పిఠాపురం, సామర్లకోట, వేట్లపాలెం, హుస్సేన్‌పురం, తిమ్మాపురంలలో జోరుగా కోడి పందేలు సాగాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మురమళ్లలో దాదాపు రూ.50 కోట్ల మేరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించారు. పోలీసులు ఈ ప్రాంతం దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఒక్క మురమళ్ల ప్రాంతంలోనే కోడి పందాల నిర్వహణకు సంబంధించి పోలీసులకు దాదాపు కోటి రూపాయల వరకూ ముడుపులు ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. మిగతా జిల్లాలోని అన్ని స్టేషన్లకు కలిపి మరో కోటి రూపాయల వరకూ పోలీసులకు ముట్టినట్టు తెలియవచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇదే జిల్లాకు చెందిన వారు కావడంతో మరింత రాజకీయ పలుకుబడి మధ్య కోడి పందాలు దర్పంగా సాగాయని తెలుస్తోంది. మురమళ్లలో నిర్వహించిన భారీ కోడి పందేలకు ఒక మోస్తరు నేతల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం హాజరయ్యారు. కోడి పందేలకు కళ్లెం వేద్దామని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ పండుగకు ముందు హెచ్చరికలు జారీచేసినా అవేమీ వాస్తవానికి కనిపించలేదు. మెట్టప్రాంతంలో జరిగిన పందాలకు రూ.50వేల నుంచి రూ.10 లక్షల్లోపు పందాలు కాస్తే, బోడి, బోడిలంక వంటి ప్రాంతాల్లో రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు, ఐ పోలవరంలో రూ.20 లక్షల నుంచి 30,40,50 లక్షల స్థాయిల్లో పందాలు సాగినట్లు తెలుస్తోంది. కొమరగిరి తదితర ప్రాంతాల్లో పొలాలను సైతం పందాల్లో పెట్టారు. కోడి పందేలకు అనుబంధంగా ఆయా బరుల వద్ద మట్కాజూదం, గుండాట, పేకాట తదితర అనుబంధ జూదాలు సైతం జోరుగా సాగాయి. కోర్టులు వద్దన్నా, కలెక్టర్ ఆంక్షలు విధించినా, పోలీసులు ససేమిరా అన్నా, రాజకీయ నాయకుల అండతో విశాఖలో కోడి పందాలు పెద్ద ఎత్తున సాగాయి. పందెంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. విశాఖ నగర శివారు ఆరిలోవ, లక్ష్మీపురం, రామకృష్ణాపురం, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లో కోడి పందాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కనుసన్నలలోనే ఈ పందాలు జరగడం గమనార్హం. అయితే, ఈ పందాల్లో పాల్గొనేందుకు అన్ని పార్టీల నుంచి నాయకులు రావడం విశేషం. పందాలు జరిగే ప్రదేశంలో పోలీసుల జాడే లేకపోవడం గమనార్హం.

చిత్రం..విశాఖ శివారు రామకృష్ణాపురంలో నిర్వహిస్తున్న కోడి పందేల దృశ్యం