ఆంధ్రప్రదేశ్‌

వారి మానాన వారిని బతకనీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 6: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ నేతలు చొక్కాలు చించుకుంటూ మరింత లోతుగా విశే్లషణలు చేయటం సరికాదంటూ రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అన్నారు. అక్కడ స్థిరపడ్డ ఆంధ్రులను ప్రశాంత వాతావరణంలో వారి మానాన వారిని బతకనిస్తే చాలంటూ హితవు చెప్పారు. శనివారం నాడాయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రులు అన్ని రంగాల్లోనూ పూర్తిగా స్థిరపడ్డారని రాష్ట్ర విభజన తరువాత అక్కడ ఆ రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్ పాలిస్తుందనే విషయాన్ని వారంతా గమనించే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. ములాయంసింగ్ యుపిలోను, లల్లూప్రసాద్ యాదవ్ బీహార్‌లోనూ స్థిరపడ్డారని, ఆ నాయకులు మరో రాష్ట్రంలో స్థానం సంపాదించిన దాఖలాలు లేవన్నారు. జాట్ వర్గానికి చెందిన చరణ్‌సింగ్ తనయుడు అజిత్‌సింగ్ యుపిలోను, దేవీలాల్ తనయుడు చౌతాలా హర్యానాలోను పాగా వేసారని వారిలో కూడా ఇతర రాష్ట్రాల్లో చొచ్చుకువెళ్లిన దాఖలాలు లేవన్నారు. మాయావతి తొలుత పంజాబ్‌లో స్వల్పంగా స్థిరపడినప్పటికీ ఆ తరువాత యుపికే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి నీరు, విద్యుత్, ఆస్తులు, అప్పులు, వనరులు పంపకాలు కూడా పూర్తయ్యాయని వాటిలో వైరుధ్యం వున్నమాటే వాస్తవమే అయినప్పటికీ చంద్రబాబునాయుడు ఇక్కడ దృష్టి సారించకుండా హైదరాబాద్ వెళ్లి అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ప్రజలు స్పందించలేదన్నారు.

17 నుంచి ఈ-సెట్
దరఖాస్తులు ఆహ్వానం
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2016కు ఈనెల 17వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎపి ఈ-సెట్ ఛైర్మెన్, అనంతపురం జెఎన్‌టియూ విసి ఉపకులపతి ఆచార్య ఎంఎంఎం.సర్కార్ తెలిపారు. శనివారం స్థానిక జెఎన్‌టియూ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈసెట్ కన్వీనర్ ఆచార్య భానుమూర్తి అధ్యక్షతన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ సర్కార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2016 నిర్వహణ బాధ్యతలు జెఎన్‌టియుకు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. గత సంవత్సరం ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈసెట్ 2016ను మే 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు రాష్టవ్య్రాప్తంగా 7 రీజనల్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దరఖాస్తులు 17 నుండి ఆన్‌లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రూ.400 చెల్లించి మార్చి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు, రూ.5వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చన్నారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఎపిఈసిఈటి.ఓఆర్‌జి వైబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈసెట్ కన్వీనర్ ఆచార్య భానుమూర్తి, జెఎన్‌టియూ రెక్టార్ ఆచార్య హెచ్.సుదర్శన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.కృష్ణయ్య, సెట్ కో కన్వీనర్ ఆచార్య దుర్గాప్రసాద్, కో-ఆర్టినేటర్ ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తుని ఘటనలో కడపవాసులు!
100 మందిపై కేసులు నమోదుకు రంగం సిద్ధం

కడప, ఫిబ్రవరి 6: తుని విధ్వంసంలో కడప జిల్లావాసులు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. విధ్వంసానికి సంబంధించిన సిసి పుటేజిలు, టివి ఛానళ్లలో ప్రసారమైన క్లిప్పింగ్‌లు పరిశీలించిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం వాటిని జిల్లాకు పంపారు. ఈ విధ్వంసంలో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ సీనియర్ వైకాపా నాయకుడి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే విధంగా వంద మంది వరకు సానుభూతిపరులు పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాతనేరస్థుల పాత్రపై కొట్టిపారేయలేదని పోలీసులు అంటున్నారు. ఈనేపధ్యంలో పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోని పాతనేరస్తుల జాబితా సేకరించే పనిలో ఉన్నారు. తుని విధ్వంసం అనంతరం జిల్లాకు చెందిన చాలామంది కాపునేతలు, వైకాపా నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా ముద్రగడ ఆమరణ దీక్ష నేపధ్యంలో జిల్లానుంచి మరోసారి ఎవ్వరూ వెళ్లకుండా నిఘా తీవ్రతరం చేశారు. వైకాపా నేతల కదలికలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.