రాష్ట్రీయం

రంకేసిన కోడెగిత్త.. పోటీపడ్డ యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం/చంద్రగిరి, జనవరి 16: సంక్రాంతి, కనుమ పండగ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో జల్లికట్టు ఉత్సవం ఉత్సాహంగా జరిగింది. జిల్లాలోని రామచంద్రపురం, చంద్రగిరి, రామకుప్పం తదితర మండలాల్లో యువత ఉత్సాహంగా జరిపారు. మంగళవారం రామచంద్రపురం మండలం బొప్పరాజుపల్లి గ్రామంలో పశువుల పండుగ నిర్వహించారు. కోడిగిత్తలు రంకేసి దూసుకొస్తుండగా యువత పోటీలు పడి పశువులను పట్టడానికి ముందుకెళ్లారు. పశువులను దొడ్లల్లో ఉంచి కాపరులు కొమ్ములను జువ్వి రంగులు వేశారు. చురుకైన పశువులకు చెక్క పలకలు కొమ్ములకు కట్టి సిద్దం చేశారు. నడివీధి గంగమ్మకు పూజలు నిర్వహించి యువకులు ఒక్కొక్కదొడ్డి నుంచి పశువులను వదులుతూ డప్పులతో బెదిరించారు. బలమైన కోడెగిత్తలకు నూతన వస్త్రాలు, ప్రత్యేక బహుమతులు కట్టి నడివీధిలోకి తరిమారు. వేగంగా వస్తున్న కోడెగిత్తలను, పశువులను పట్టుకోవడానికి యువకులు పోటీలు పడ్డారు.