రాష్ట్రీయం

బాధ్యుల్ని వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: కోర్టు ఆదేశాలు ధిక్కరించి కోడి పందేలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కోడి పందేల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, గురువారం నుంచి ప్రారంభం కానున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు ఏర్పాట్లపై డీజీపీతో చర్చించామని తెలిపారు. కాగా, డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాలకొండయ్య రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్పను వెలగపూడి సచివాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, కోడి పందేల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి డీజీపీ ఆయనకు వివరించారు.