రాష్ట్రీయం

టీటీడీపీని తెరాసలో విలీనం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం చేసిన వ్యాఖ్య లు పార్టీలో కలకలం సృష్టించాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు అంతరించి పోతుందనే అనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో నెలకొందని, పార్టీని బలోపేతం చేయలేని పక్షంలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం మంచిదని ఆ పార్టీ సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాలతో పాటు రాష్ట్రంలో అన్ని పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీరామారావు 21వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించిన తర్వాత మోత్కుపల్లి విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ దుస్థితిని వివరించారు. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ముందు రెండే రెండు ఆఫ్షన్లు ఉన్నాయి. ఒకటి పార్టీని టీఆర్‌ఎస్‌లోకలిపేయాలి లేదంటే రాష్టమ్రంతా చంద్రబాబు పర్యటించి పార్టీని బలోపేతం చేయాలి అని మోత్కుపల్లి ప్రకటించారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని పనిచేస్తామనుకున్నా, తమకు సహకారం లభించడం లేదన్నారు. ఈ విషయం తనను బాధిస్తోందన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టీడీపీలో ఉండి నాయకుడిగా ఎదిగారని ఆయన గుర్తు చేశారు. ఇంకా చాలా మంది మంత్రులు టీడీపీ నుంచి వెళ్లారన్నారు. గత ఎన్నికల్లో పార్టీకి 40 లక్షల మంది ఓట్లు వేశారని, 22 శాతం ఓట్లున్న పార్టీలో కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం పార్టీపైన ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో టీడీపీని విలీనం చేసి ఎన్టీఆర్ ఆత్మకుశాంతి చేకూర్చాలన్నారు. తాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నానని చెప్పారు. తమను చంద్రబాబు అర్థం చేసుకోవాలన్నారు. కాగా టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం గౌరవమని సీనియర్ నేత మోత్కుపల్లి
నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఈ విషయమై ఆయనవిలేఖర్లతో మాట్లాడుతూ ఇటువంటి విషయాలు పార్టీ పొలిట్‌బ్యూరోలో చర్చించాలన్నారు. తెలంగాణలో టిడిపి ఉంటుందని, బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనేకసార్లు స్పష్టం చేశారన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందన్నారు. ఈ విషయమై పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
కాగా మరో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ మోత్కుపల్లి భావోద్వేగంతో మాట్లాడినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. టిడిపి జాతీయ పార్టీ అని, ఈ పార్టీ ప్రాంతీయ పార్టీతో ఎలా విలీనమవుతుందన్నారు. టిడిపికి తెలంగాణలో చెక్కుచెదరని పునాది ఉందన్నారు. కేడర్‌లో నిరాశ కలిగించే వ్యాఖ్యలను ఎవరూ చేయరాదని ఆయన అన్నారు. సీనియర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మోత్కుపల్లి మాట్లాడిన తీరు విచారకరమన్నారు. పార్టీకి తెలంగాణలో మంచి బలం ఉందని, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
చిత్రం..ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న మోత్కుపల్లి