రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ స్వాధీన ప్రక్రియ జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అగ్రి గోల్డ్‌ను స్వాధీనం చేసుకోవడంపై స్టేటస్ రిపోర్టును ఇవ్వాలని హైకోర్టు గురువారం ఎస్సెల్ జీ గ్రూప్ సుభాష్ చంద్ర ఫౌండేషన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరించడం లేదని ఎస్సెల్ జీ గ్రూపు న్యాయవాది పి శ్రీరఘురాం కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదావేశారు.