రాష్ట్రీయం

దుర్గమ్మ సన్నిధిలో మహారాష్ట్ర గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు సతీసమేతంగా గురువారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో వేదవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ విద్యాసాగరరావు సతీమణి వినోదిని, కుమార్తె రజనిలతో కలిసి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇవి పుష్పవర్థన్, స్పెషల్ ఆఫీసరు వి.త్రినాథ్, దేవస్థాన చైర్మన్ యలమంచలి గౌరంగబాబు ఆలయ సాంప్రదాయ మర్యాదలతో అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని గవర్నర్ దంపతులకు మర్యాదపూర్వకంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్లు పద్మశేఖర్, కోడెల సూర్యలత, పెంచలయ్య, సాంబసుశీల, పాప, బీర ప్రసాద్, ఆర్డీవో యం.చక్రపాణి తదితరులు గవర్నరు విద్యాసాగరరావుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం గవర్నరు సిహెచ్ విద్యాసాగరరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనకదుర్గమ్మవారిని సతీసమేతంగా దర్శనం చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉందని అన్నారు. కొత్త రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందన్నారు.

చిత్రం..దుర్గమ్మను దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దంపతులు