రాష్ట్రీయం

24న రథ సప్తమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 18: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 24న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, ఎన్‌ఆర్‌ఐలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై మాడవీధుల్లో ఊరేగే కారణంగా రథసప్తమిని ఒక రోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా 24వ తేదీ ఉదయం 5.30 నుంచి 8గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, 4 నుంచి 5గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మాడవీధుల్లో జరిగే వాహన సేవలను తిలకించే భక్తులకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.