రాష్ట్రీయం

యాంకర్ ప్రదీప్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో గత నెల 31వ తేదీ రాత్రి ట్రాఫిక్ పోలీసులకు దొరికి పోయిన కేసులో టివి యాంకర్ ప్రదీప్‌కు నాంపల్లి కోర్టు మూడేళ్ల పాటు అతని డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసి రూ.2,100 జరిమాన విధించింది. శుక్రవారం ప్రదీప్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఇటీవలే ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్‌కు ప్రదీప్ తన తండ్రితో పాటు హాజరైన సంగతి తెలిసిందే. మద్యం మోతాదుకు మించి సేవించి తన వాహనం తానే నడుపుకుంటూ రావడంతో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ పోలీసుల తనిఖీల్లో దొరికిన సంగతి తెలిసిందే. ఆ రోజు బ్రీతింగ్ అనలైజర్‌తో పరీక్షించగా 170 పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్ కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరైన ప్రదీప్‌ను న్యాయమూర్తి గట్టిగా మందలించారు. మద్యం తాగి వాహనం సేవించ వద్దని మీరే ప్రచారం చేసి మీరే వాహనం నడిపితే ఎలా అని ప్రశ్నించారు. ఆరోజు డ్రైవర్ లేని కారణంగా తానే స్వయంగా నడుపుకుంటూ వచ్చానని, తప్పేనని అంగీకరించి, ఇంకెప్పెడూ ఈ తప్పు చేయనని కోర్టుకు ప్రదీప్ వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు, రూ.2100 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.